శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 24, 2020 , 00:55:40

సాగునీటి సంవత్సరంలా 2020

సాగునీటి సంవత్సరంలా  2020
  • -కథలాపూర్‌, మేడిపల్లి మండలాలను సస్యశ్యామలం చేస్తాం
  • -వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు
  • -రెండు మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
  • -పలు గ్రామపంచాతీయలకు ట్రాక్టర్ల అందజేత
  • -పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు వసంత, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి

కథలాపూర్‌: నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాలకు సాగునీరు అందించి 2020 సంవత్సరాన్ని సాగునీటి సంవత్సరంగా చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో గ్రామపంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ఆయన ప్రారంభించారు. అంతకుముందు మండలంలోని 68మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వరదకాలువకు 19లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి 46వేల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని, లక్ష్యానికి దగ్గరగా ఉన్నామన్నారు. పల్లెప్రగతి నిరంతరంగా జరిగితేనే అసలైన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. సంస్కరణలతో కూడిన అభివృద్ధి జరిగేలా కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఉందని, అందుకు సర్పంచులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఏటా కేంద్రానికి రూ.30వేల కోట్లను పన్నుల రూపంలో పంపిస్తుండగా కేంద్రం మాత్రం రాష్ర్టానికి కొన్ని నిధులే కేటాయిస్తుందన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ.. పల్లెప్రగతితో గ్రామాలకు కొత్త కళ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గ్రామపంచాయతీలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సర్పంచులు ఖర్చుపెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చిన ట్రాక్టర్లతో చెత్త సేకరణతో పాటు మొక్కలకు నీళ్లు అందించాలన్నారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని, ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలన్నారు. తాసిల్దార్‌ దూలం మధుగౌడ్‌, ఎంపీడీవో జనార్దన్‌, ఎంపీపీ జవ్వాజి రేవతి, జడ్పీటీసీ నాగం భూమయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎంజీ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు బొడ్డు బాలు, వైస్‌ ఎంపీపీ గండ్ర కిరణ్‌రావు, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ రఫీ, సింగిల్‌విండో చైర్మన్‌ దాసరి గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్‌, నాయకులు పొలాస నరేందర్‌, జెమిని శ్రీనివాస్‌, గడ్డం భూమరెడ్డి, జవ్వాజి గణేశ్‌, దొప్పల జలేందర్‌, మామిడిపెల్లి రవి, చీటి విద్యాసాగర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కంటె నీరజ, గసికంటి లత, కూన సులోచన, కొండ ఆంజనేయలు, భైర హేమలత, దొప్పల హైమావతి, గడిల గంగప్రసాద్‌, ధరావత్‌ సరోజ, అంబటి లత, మల్యాల రమేశ్‌, పోతు శేఖర్‌, ధర్మపురి జలేందర్‌, ఏజీబీ మహేందర్‌, నస్కూరి భాస్కర్‌, శీలం మోహన్‌రెడ్డి, అల్లె సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్‌..

మేడిపల్లి: సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకాలను ప్రవేశపెట్టి ఆడబిడ్డలకు మేనమామ అయ్యారని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కొనియాడారు. మండల కేంద్రంలోని పీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో రూ.లక్షా 116చొప్పున 79మందికి, రూ.75వేల 116చొప్పున 12మందికి, రూ.51వేల చొప్పున ఇద్దరికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే పోరుమల్ల, కట్లకుంట, మేడిపల్లి, కొండాపూర్‌ గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్లెప్రగతి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కనిపిస్తుందని, ఇది నిరంతరంగా జరగాలని సూచించారు. ఇందులో భాగంగానే పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ, మెట్ట ప్రాంతమైన చందుర్తి మండలాల్లోని 42వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. మిడ్‌మానేరులో 25టీఎంసీల నీరు చేరిందని,  దీని నుంచి లిఫ్ట్‌ ద్వారా వేములవాడ శ్రీరాజరాజేశ్వర గుడి చెరువు నింపుతామన్నారు. మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలల్లో 19లిఫ్టులను గుర్తించామని, వీటిని పూర్తి చేసి చెరువులను నీటితో నింపుతామన్నారు. దీంతో 56వేల ఎకరాలు సాగులోకి వచ్చి మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలు సస్యశ్యామలమవుతాయన్నారు. తొంబర్‌రావుపేట గ్రామ శివారు నుంచి వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ కెనాల్‌కు డీ 52 తూము ఏర్పాటు చేసి చెరువులు నింపినట్లు గుర్తు చేశారు.

మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం పునర్జీవ పథకంతో చెరువులను నింపి రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, మండల ఉపాధ్యక్షుడు దొంతి శ్రీనివాస్‌, సర్పంచులు క్యాతం వరలక్ష్మి, గడ్డం నారాయణరెడ్డి, ద్యావనపెల్లి అభిలాష్‌, కాచర్ల సురేశ్‌, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, తౌటి తిరుపతిరెడ్డి, దుంపేట లక్ష్మీనర్సయ్య, వంగ వెంకటేశం, మాలోత్‌ లచ్చనాయక్‌, బాలుసాని లహరిక, చెక్కపెల్లి అరుణ, ఎంపీటీసీలు అంకం వినోద, మకిలి దాస్‌, పన్నా ల లావణ్య, చెన్నమనేని రవీందర్‌రావు, నాయిని మమత, మ్యాదరి లక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ హైమద్‌, సింగిల్‌ విండో చైర్మన్లు మిట్టపెల్లి భూమారెడ్డి, కొప్పెర లింగారెడ్డి, గంగారెడ్డి, తాసిల్దార్‌ రాజేశ్వర్‌, ఎంపీడీవో పద్మజ, ఆర్‌ఐలు నాగేశ్‌, అర్చనకుమారి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అంకం విజయసాగర్‌, నాయకులు సుధవేని గంగాధర్‌, దొనకంటి రాజరత్నాకర్‌రావు, పొలాస నరేందర్‌, నెల్లుట్ల ప్రభాకర్‌, సుధవేని భూమేశ్‌గౌడ్‌, నాంచారి రాజేందర్‌, సోమ నరేశ్‌, నాయిని రవి, ఆదె లక్ష్మీరాజం, గాజిపాషా, పన్నాల రాజేశ్వర్‌రెడ్డి, చెక్కపెల్లి రఘు, తోకల రవీందర్‌, దర్శనాల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.   logo