గురువారం 09 ఏప్రిల్ 2020
Jagityal - Jan 24, 2020 , 00:55:40

వెంటనే ట్రాక్టర్లను రిలీజ్‌ చేయాలి

వెంటనే ట్రాక్టర్లను రిలీజ్‌ చేయాలి
  • - కలెక్టర్‌ శరత్‌
  • - ట్రాక్టర్ల కొనుగోలుపై సమీక్ష
  • - జిల్లాలో స్టేట్‌ లెవెల్‌ అసిస్మెంట్‌ సర్వే పైనా అధికారుతో సమావేశం

జగిత్యాల, నమస్తే తెలంగాణ : బ్యాంకుల నుంచి మంజూరై ఏజెన్సీల్లో పెండింగ్‌లో ఉన్న వాటి గురించి ఏజెన్సీల వారితో మాట్లాడుతూ వెంటనే ట్రాక్టర్లను రిలీజ్‌ చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగం గా ట్రాక్టర్ల కొనుగోలుపై గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సమీక్షించారు. మండలాల వారీగా సమీక్షించిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ట్రాక్టర్ల కొనుగోలులో గ్రామ పంచాయతీల నుంచి బ్యాం కులకు మార్జిన్‌ మనీ చెల్లించినా మంజూరు చేయ ని బ్యాంకుల వివరాలను తీసుకున్నారు.  ఏజెన్సీ లు చెక్కులు ముట్టిన వారం రోజుల్లో ట్రాక్టర్లను ఇవ్వకుంటే ఏజెన్సీని రద్దు చేయడంతో పాటు 10శాతం పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. అనంతరం ఆ ఏజెన్సీని రద్దు చేసి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఇతర ఏజెన్సీలకు ఇస్తామని తెలిపారు. మండల పంచాయతీ అధికారుల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల విషయమై ఏమాత్రం అలసత్వం లేకుండా పెండింగ్‌ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వారం రోజుల్లో పూర్తి చేయించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె లక్ష్మీనారాయ ణ, డీపీవో శేఖర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గౌతమ్‌ లక్ష్మీనారాయణ, బ్యాంకు మేనేజర్లు, మండల పంచాయతీ అధికారులు, ట్రాక్టర్‌ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.

స్టేట్‌ లెవెల్‌ అసిస్మెంట్‌పై సర్వే

జిల్లాలో స్టేట్‌ లెవెల్‌ అసిస్మెంట్‌ సర్వేపై గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శరత్‌ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన అ నంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 7,8 తరగతుల విద్యార్థులకు పదో తరగతి పరీక్ష విధానం తరహాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షలకు ప్ర శ్నాపత్రాలు, ఓఎంఆర్‌ షీట్స్‌ హైదరాబాద్‌ నుంచి ఈ నెల 28న జిల్లాకు వస్తాయని, వాటిని సంబంధిత మండలంలోని పోలీస్‌ స్టేషన్‌లో భద్రపరచాలన్నారు. భద్రపరిచిన పేపర్లను ఈ నెల 30న ఉద యం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని, పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించే రీతిలో ఈ పరీక్షలను నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖతో పాటు జిల్లాలోని ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేక అధికారి  చొప్పున జిల్లాలోని 18మండలాలకు నియమిస్తూ పరీక్షలు ఎలాంటి లోపాలు లేకుం డా పరీక్ష హాల్‌లో 8,9వ తరగతి సబ్జెక్టు టీచర్లను డ్యూటీలో వేయకూడదన్నారు. ఈ కార్యక్రమం లో జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్‌, డీఈవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ, ఎంఈవోలు పాల్గొన్నారు.logo