గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 24, 2020 , 00:55:40

నేటి తరానికి స్ఫూర్తి నేతాజీ

నేటి తరానికి స్ఫూర్తి నేతాజీ
  • - స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర ఎనలేనిది
  • - బంగారు తెలంగాణకు విద్యార్థులే సారథులు
  • - సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల, నమస్తే తెలంగాణ : దేశ స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పాత్ర విస్మరించలేనిదని, నేతాజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో నేతాజీ 124వ జయంతి వేడుకలను, నేతాజీ వృత్తివిద్యా కళాశాల వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ సం జయ్‌ కుమార్‌ మాట్లాడుతూ బంగారు తెలంగాణకు విద్యార్థులే సారథులన్నారు. మాజీ ఎంపీ క ల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ద్వారా ఏర్పా టు చేసిన నైపుణ్యత శిక్షణా కేంద్రాల్లో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందారని గుర్తు చే స్తూ వృత్తి విద్యా కళాశాలను నిర్వహిస్తున్న సింగం భాస్కర్‌ను అభినందించారు. అనంతరం టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్‌ కుమార్‌ మా ట్లాడుతూ నేతాజీకి భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించాలని, జగిత్యాల జిల్లా కేంద్రం లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం పరీక్షా ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన, ఆ టల పోటీల్లో విజేతలుగా నిలిచిన నేతాజీ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ బహుమతులు, అవార్డు లు అందజేశారు. అనంత రం విద్యార్థులు చేసిన నృ త్యాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో నేతాజీ విద్యా సంస్థల అధినేత సింగం భాస్కర్‌, నేతాజీ ట్రస్టు ఉపాధ్యక్షుడు మానపురి రాజనర్సయ్య, సీనియర్‌ సీటిజన్స్‌ జిల్లా అధ్యక్షుడు సింగం గంగాధర్‌, ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, మామిడాల రమేశ్‌, అనిల్‌, వర్మ, శ్రీకాంత్‌, లక్ష్మి, మౌ నిక, మం జుల, కల్యాణి పాల్గొన్నారు.logo