శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 23, 2020 , 01:08:01

బాక్సుల్లో భవితవ్యం

బాక్సుల్లో భవితవ్యం
  • -స్ట్రాంగ్‌ రూముల్లో ‘పోలింగ్‌ బ్యాలెట్లు’
  • -25న ఫలితాలు
  • -ఉత్కంఠలో అభ్యర్థులు

జగిత్యాల, నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్‌: జిల్లాలో బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయత్రం 5వరకు బ్యాలెట్‌ పద్ధతిలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగా యి. రాత్రి వరకు పోలింగ్‌ బ్యాలెట్‌ బాక్సులు ఆయా బల్దియాల పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు చేరాయి. పటిష్ట భద్రత మధ్య వాటిని సురక్షితంగా ఉంచారు. జగిత్యాలలోని 48వార్డులు, కోరుట్లలో 30వార్డులకు, మెట్‌పల్లిలో 25వార్డులకు, ధర్మపురిలో 15వార్డులకు, రాయికల్‌లో 12వార్డులకు ఎన్నికలు జరిగిన అనంతరం బ్యాలెట్స్‌ బాక్సులను సురక్షితంగా తరలించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా వార్డు ల్లో ఎన్నికల సరళి అనంతరం సామగ్రితో పాటూ బ్యాలెట్‌ బాక్సులను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. కోరుట్ల పరిధిలోనివి పట్టణ శివారులోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ హైస్కూల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి తీసుకెళ్లి భద్రపరిచారు. పోలింగ్‌ ప్రక్రియలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌, డీఈఈ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల బల్దియా పరిధిలోని బ్యాలెట్‌ బాక్సులను వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. ఈనెల 25న వాటిని తెరచి కౌంటింగ్‌ అనంతరం ఫలితాలు వెలువడనుండగా అభ్యర్థులు ఉత్కంఠలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ప్రచారం, పోలింగ్‌ ముగిసేవరకు తీరిక లేకుండా గడిపిన అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు ఎన్నికలు ముగిసిన అనంతరం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక గెలుపు అంచనాల్లో తలమునకలయ్యారు.logo