సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 23, 2020 , 01:02:04

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం
  • -సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పథాన తెలంగాణ
  • -మిషన్‌ భగీరథతో పల్లెపల్లెకూ సురక్షిత తాగునీరు
  • -రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • -వెల్గటూర్‌ మండలంలోని రెండు గ్రామాల్లో పర్యటన
  • -కొండాపూర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ప్రారంభోత్సవం

వెల్గటూర్‌ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొండాపూర్‌, ఎండపెల్లి గ్రామాల్లో బుధవారం నాయకులతో కలిసి పర్యటించారు. కొండాపూర్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, కార్యాలయం ఎదుట పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు సురక్షితమైన తాగునీటిని అందించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. రైతుబంధు కార్యక్రమం ద్వారా 57లక్షల మంది రైతులకు లబ్ధ్ది చేకూరుతుందని తెలిపారు. రైతుబీమా పథకం పేద రైతులకు ఎంతగానో దోహ దపడుతుందన్నారు. రైతులు మృతి చెందిన వా రం రోజుల్లోపే నామిని ఖాతాలో రూ.5లక్షలు జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వెల్గటూర్‌ మండలంలోని స్తంభంపెల్లి, వెల్గటూర్‌ గ్రామాల్లోని పెద్ద చెరువులకు ఎత్తిపోతల పథకాలు మంజూరు కావడం వల్ల వందల ఎకరాల బీడుభూమి సాగులోకి రానున్నాయని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని ఎండపెల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో రూ.25లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, నాయకులు ఎలేటి కృష్ణా రెడ్డి, బద్రినారాయణ రావు, చదువుల రాంచందర్‌ గౌడ్‌, సింహాచలం జగన్‌, మారం జలేందర్‌ రెడ్డి, కూనమల్ల లింగయ్య, రాజేశ్వర్‌ రెడ్డి, రాంరెడ్డి, ఎండీ సలీం, తిరుపతి, రాజు, కోడి గంగయ్య, రామడుగు రాజేశ్‌, తదితరులు పాల్గొన్నారు.
logo