సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 22, 2020 , 05:08:23

మున్సి ‘పోల్స్‌' నేడే

మున్సి ‘పోల్స్‌' నేడే
 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌

నేటి ‘పుర’ పోరుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం రెడీ అయింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా, ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. మొత్తం  2,04,509 మంది ఓటర్లు ఉండగా, 285 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. 51 సమస్యాత్మక, 18 అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం ఐదు చోట్ల ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని స్వీకరించి, తమకు కేటాయించిన పోలింగ్‌ సెంటర్లకు చేరుకున్నారు. ఇటు ఏకగ్రీవమైన నాలుగు వార్డులు పోను, మిగిలిన 130వార్డుల నుంచి 562 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. 

-ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు
-అన్ని ఏర్పాట్లూ చేసిన అధికారులు
-సామగ్రి పంపిణీ పూర్తి
-కేంద్రాలకు     చేరుకున్న సిబ్బంది
-పరిశీలించిన కలెక్టర్‌, జేసీ, సబ్‌ కలెక్టర్‌
-అమలుల్లో 144 సెక్షన్‌
-51 సమస్యాత్మక, 18 అతి సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
-ప్రతి చోటా వెబ్‌ కాస్టింగ్‌ 

జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి, నమస్తే తెలంగాణ/జగిత్యాల అర్బన్‌/కోరుట్లటౌన్‌/రాయికల్‌ : జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం మున్సిపల్‌ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఐదు బల్దియాల్లో 2,04,509 మంది ఓటర్లుండగా వీరిలో 1,00,227 మంది పురుషులు, 1,04,277 మంది మహిళలు , ఇతరులు ఐదుగురు ఉ న్నారు. జిల్లాలో 134 వార్డులుండగా మెట్‌పల్లిలో 1, కోరుట్లలో 3 వార్డులు ఏకగ్రీవం కావడంతో 130 వార్డులకు ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శరత్‌ ఆధ్వర్యంలో అ న్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. జిల్లాలో 97 పోలింగ్‌ లోకేషన్లుండగా, 285 పోలింగ్‌ స్టేషన్లున్నా యి. 45 మంది ఆర్వోలు , 45మంది ఏఆర్వోలు , 31మంది జోనల్‌ అధికారులు, 362మందిపీఓలు,  362మంది ఏపీఓలు, 1086 మంది  ఓపీఓలు మొత్తం ఎన్నికల నిర్వహణకు 1,810 మందిని నియమించారు. వీరికి అంతకుముందే ఎన్నికల నిర్వహణ విషయంలో శిక్ష ణ ఇచ్చారు. 5 మున్సిపాలిటీలను 31 జోన్లుగా, రూట్లుగా విభజించి జోనల్‌ ఆఫీసర్లు, రూటు ఆఫీసర్లను నియమించామని, ఎన్నికల్లో ప్రలోభాలను నివారించేందుకు ముందస్తుగా చర్యలుగా 13 ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ బృందాలు, 15 స్టాటిస్టిక్‌ సర్వేలయన్స్‌ బృందాలను ఏర్పాటు చే సినట్లు కలెక్టర్‌ శరత్‌ వెల్లడించారు. 285 పోలింగ్‌ స్టేషన్లలో 51 పోలింగ్‌ స్టేషన్లను సమస్యాత్మక, 18 అతిసమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, ఈ పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 51 మంది మైక్రో అబ్జర్వర్లను ని యమించామని, 51 పోలింగ్‌ స్టేషన్లలో లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ఉంటుందని చెప్పారు.        
 

మున్సిపాలిటీలవారీగా..

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులుండగా 117 పోలింగ్‌ స్టేషన్లు, 83,929మంది ఓటర్లున్నారు. వీరిలో 41,523 మంది పురుష ఓటర్లు, 42,403 మంది మ హిళా ఓటర్లున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 117 పోలింగ్‌ స్టేషన్ల కోసం 16మంది ఆర్వోలు, 16 మంది ఏఆర్వోలు, 12 మంది జోనల్‌ అధికారులు, 155 మంది పీఓలు, 155మంది ఏ పీఓలు, 464 మంది ఓపీఓలు మొత్తం 774 మంది సిబ్బందిని నియమించారు. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో మున్సిపల్‌ ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ఎన్నికల సిబ్బందిని అక్కడ నుంచి బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ శరత్‌ మంగళవారం తనిఖీ చేసి, అధికారులతో ఏర్పాట్ల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ లచ్చిరెడ్డి ఉన్నారు. కోరుట్లలో 30, మెట్‌పల్లిలో 25 వార్డులకు ఎన్నికలు నిర్వహిచనున్నారు. కోరుట్లలో 30 వార్డులలో కలిపి 139 మంది, మెట్‌పల్లిలో 25 వార్డులలో కలపి 124 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ధర్మపురి మున్సిపల్‌ పరిధిలో 15వార్డులు, 12,379 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 6,027మంది, మహిళలు 6,351 మంది ఉన్నారు.  51మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ధర్మపురి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు కృష్ణ ఆదిత్య, కలెక్టర్‌ శరత్‌  పరిశీలించారు.  రాయికల్‌ మున్సిపాలిటీలో 12 వార్డులకు 24 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, పోలింగ్‌స్టేషన్లను జేసీ బేతి రాజేశం పరిశీలించారు.

 ప్రత్యేక భద్రత : జిల్లా ఎన్నికల పరిశీలకుడు కృష్ణ ఆదిత్య

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక భద్రత కల్పించిన్ల జిల్లా మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. కోరుట్ల పట్టణ శివారు ఎస్‌ఎఫ్‌ఎస్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు.  పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి 71పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది జాబితాను పరిశీలించారు. హాజరైన సిబ్బందికి అందించిన ఎన్నికల సామగ్రిపై ఆరా తీశారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రూట్‌ల ఆధారంగా ఎంపిక చేసిన పోలింగ్‌ కేంద్రాల ఎన్నికల సామగ్రిని వరుస క్రమంలో అందించిన అధికారులు సామగ్రిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందిని బూత్‌లకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశారు. పట్టణంలో 33 వార్డులు ఉండగా, 3 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 30 వార్డుల్లో ఎన్నికల కోసం 7 రూట్‌లు, 7 జోన్‌లుగా విభజించారు. 71 పోలింగ్‌ బూత్‌లను వార్డుల వారీగా ఏర్పాటు చేశారు. ఆయా పోలింగ్‌ బూత్‌ల్లో 89 మంది పీవోలు, 89 మంది ఏపీవోలు, 272 మంది ఓపీవోలను, ఆర్వో, ఏర్వోలు 11 మంది చొప్పున నియమించారు. 8 సమస్యాత్మకమైన పోలింగ్‌ బూత్‌లను గుర్తించారు. ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం, సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ పొత్రు, ఎన్నికల అధికారులు అయాజ్‌, తాసిల్దార్‌ సత్యనారాయణ, డీఈఈ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.logo