బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 22, 2020 , 05:07:00

నందిమేడారం టూ చెగ్యాం

నందిమేడారం టూ చెగ్యాం
  • -తూము ద్వారా నీటి విడుదల
  • - స్థానిక రైతుల హర్షం
  • -ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం వెల్గటూర్‌: పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారం చెరువు నుంచి ప్రత్యేక తూము ఏర్పాటు చేసి, వెల్గటూర్‌ మండలంలోని చెగ్యాం చెరువుకు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మండలం లోని గొడిసెలపేట, పైడిపెల్లి గ్రామాల రైతులు మంగళవారం సీఎం కేసీఆర్‌, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని గొడిసెలపేట, పైడిపెల్లి, చెగ్యాం, తాళ్లకొత్తపేట, శానబండ, పడకల్‌ గ్రామాల రైతులు మంత్రిని కలిసి మేడారం చెరువు నుంచి మండలంలోని చెగ్యాం చెరువులోకి నీటిని విడుదల చేయాలని కోరగా, సం బంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా మం త్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మోత్కు స్వరూప, గంగుల నగేశ్‌, వైస్‌ ఎంపీపీ ముస్కు కవి, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.logo
>>>>>>