బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 22, 2020 , 05:01:51

భక్తజన ‘కొండ’

భక్తజన ‘కొండ’
  • -సమక్క జాతర సమీపిస్తుండడంతో పెరిగిన రద్దీ
  • -మంగళవారం సుమారు 30వేలమంది రాక
  • -భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
  • -ఆలయానికి రూ.5లక్షలదాకా ఆదాయం
 కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తులతో మంగళవారం కిటకిటలాడింది. సమ్మక్క జాతర సమీపిస్తుండడంతో రద్దీ పెరిగింది. ఉదయమే భక్తులు కోనేరులో స్నానాలు చేసి అంజన్న దర్శనానికి బారు లు తీరారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి వారితో పాటు అనుబంధ ఆలయాలైన లక్ష్మీ అమ్మవారు, వేంకటేశ్వర స్వామి, బేతాళ స్వామి, బొజ్జపోతన, మునిగుహలు, కో దండ రామాలయం, కొండల రాముడి అడుగులు, తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతం, అష్టోత్తర శతనామావళి పూజ, అభిషేకం, హారతి, భజనలు, తదితర ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌ ట్రస్ట్‌ మారుతి స్వామి, ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రావు, సంపత్‌, అర్చకులు పాల్గొన్నారు.
- మల్యాల


logo