గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 21, 2020 , 01:30:00

అభివృద్ధ్దిని చూసి ఓటెయ్యండి

అభివృద్ధ్దిని చూసి ఓటెయ్యండి
  • -కారుకు ఓటేస్తే కేసీఆర్‌ను ఆశీర్వదించినట్లే..
  • -కాంగ్రెస్‌, బీజేపీకి వేస్తే మురికి కాలువలో వేసినట్లే..
  • -టీఆర్‌ఎస్‌ పాలనలోనే పట్టణాల సమగ్రాభివృద్ధి..
  • -ధర్మపురిలో ఇండ్లులేని నిరుపేదలకు వంద గజాల స్థలం
  • -రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • -టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ధర్మపురిలో ప్రచారం
  • -అడుగడునా స్వాగతం పలికిన ప్రజలుటీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధి పనులను చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేస్తే సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించినట్లేననీ, కాంగ్రెస్‌, బీజేపీకీ ఓటేస్తే మురికి కాలువల వేసినట్లేనని చెప్పారు. పెద్దపెల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకానితో కలిసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ధర్మపురిలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన ప్రచారం చేశారు. ఘన స్వాగతాల నడుమ గల్లీల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ పాలనలోనే పట్టణాల ప్రగతి సాధ్యమనీ, 280కోట్లతో ధర్మపురిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
- ధర్మపురి, నమస్తే తెలంగాణ

 ధర్మపురి, నమస్తేతెలంగాణ :   అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ధర్మపురిలోని పలు వార్డుల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డులకు చేరుకున్న మంత్రికి అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభ్యర్థుల ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో  డప్పు చప్పుళ్ల మధ్య స్వాగతం పలుకుతూ మంత్రికి జననీరాజనం పలికారు. మంత్రి ఈశ్వర్‌ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ ఎంతో చారి త్రాత్మకమైన ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిత్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అటువంటి ధర్మపురి క్షేత్రం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి పట్టణంలో ఇల్లు లేని కుటుం బం ఉండరాదనీ, రానున్న రోజుల్లో ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబానికి 100 గజాల స్థలం అందజేస్తామని ప్రకటించారు. దీని కోసం 20 నుంచి 30 ఎకరాల స్థలం త్వరలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు.  ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఐదేళ్ల కాలంలో రూ.1300 కోట్ల నిధులు కేటాయించగా, ఒక్క ధర్మపురి పట్టణానికే రూ.280కోట్లు వెచ్చించినట్లు గుర్తుచేశారు. రూ.134.68కోట్ల విలువ గల పను లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ధర్మపురిలో షాదీఖానా నిర్మాణానికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. మైనార్టీలంతా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధ్దిపొందినవారేననీ, మైనార్టీల అభివృద్ధి కోసం సర్కార్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. మైనార్టీలు కారుగుర్తుకే ఓటు వేయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఒరిగేదేమి లేదని స్పష్టం చేశారు.  కారుకు ఓటేస్తే కేసీఆర్‌ను ఆశీర్వదించినట్లేనన్నారు.గోదావరి మంగళి ఘాట్‌ వద్ద సుందరీకరణ పనులు చేపట్టి, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.  ధర్మపురిలో చిరకాల సమస్యగా మారిన గోదావరిలో మురుగు నీరు కలుసే సమస్యకు చరమగీతం పా డామన్నారు.  ధర్మపురి గోదావరి ఒడ్డున మోడల్‌ శ్మశానవాటిక నిర్మాణానికి రూ.1కోటి వెచ్చించినట్లు తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నామన్నారు. ముందస్తు వైద్యసేవల కోసం ఎల్‌ఓసీలను కూడా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను చూసి కారుగుర్తుకు ఓటు వేయాలని మరోసారి సూచించారు.

 అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి : ఎంపీ వెంకటేశ్‌నేత

ధర్మపురి మున్సిపల్‌ ఎన్నికల్లో కారుగుర్తుకే ఓటువేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత సూచించారు. సోమవారం ధర్మపురిలోని పలు వార్డులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ పథకాల ద్వా రా లబ్ధిపొందిన ప్రతి కుటుంబం ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు. కారుగుర్తుపైనే ఓటువేసి అభ్యర్థులను మెజార్ట్టీతో గెలిపిం చాలని అభ్యర్థించారు.

పార్టీలో పలువురి చేరికలు..

ధర్మపురి పట్టణానికి చెందిన దాదాపు 200మంది యువకులు మంత్రి ఈశ్వర్‌ సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ పార్టీ కండువాకప్పి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ ప్రచార  కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావ్‌, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దా మోదర్‌, జడ్పీటీసీ సభ్యులు బాదినేని రాజేందర్‌, బత్తిని అరుణ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌, నాయకులు ఎల్లాల శ్రీకాం త్‌ రెడ్డి, ఓరుగంటి రమణారావ్‌, సౌళ్ల భీమయ్య, సౌళ్ల నరేశ్‌, అక్కనపల్లి సునీల్‌కుమార్‌, మ్యాన శంకర్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్‌ ఉన్నారు.logo