సోమవారం 06 ఏప్రిల్ 2020
Jagityal - Jan 21, 2020 , 01:28:23

జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా

జగిత్యాల మున్సిపాలిటీపై గులాబీ జెండా
  • - రాయికల్‌ మున్సిపాలిటీ తొలిపీఠం మాదే
  • - అభివృద్ధి పథకాలే విజయ సోపానాలు
  • - ఎంపీగా కవిత చూపిన అభివృద్ధి మార్గంలోనే మా పయనం
  • - 4వేల డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మించి తీరుతాం
  • - యావర్‌ రోడ్డు విస్తరణ అంశంపై స్పష్టంగా ఉన్నాం
  • - ముప్పై ఏండ్లు బల్దియాను పాలించి, అరవై ఏండ్లు వెనక్కి నెట్టిన ఘనత కాంగ్రెస్‌ది..
  • - మాజీ ఎంపీ కవితకు జగిత్యాల, రాయికల్‌ బల్దియాల గెలుపును కానుకగా ఇస్తాం
  • - ‘నమస్తే’తో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 68 ఏళ్ల క్రితం ఏర్పడిన జగిత్యాల మున్సిపాలిటీపై తొలిసారిగా గులాబీ జెండా ఎగరబోతుందని, కొత్త మున్సిపాలిటీగా అవతరించిన రాయికల్‌ను సైతం గులాబీదళం కైవసం చేసుకుంటుందనీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయలను పంచుకున్నారు. ముప్పై ఏండ్లు జగిత్యాలను బల్దియాను పాలించి, అభివృద్ధిలో అరవై ఏండ్లు వెనక్కి నెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని విమర్శించారు. త్వరలోనే స్వర్ణయుగం ప్రారంభమవుతుందనీ, అభివృద్ధి పథకాలే తమకు విజయ సోపానాలుగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  జగిత్యాల మున్సిపాలిటీపై తొలిసారిగా గులాబీ జెండ ఎగరబోతుందనీ, అలాగే కొత మున్సిపాలిటీగా అవతరించిన రాయికల్‌ను సైతం గులాబీదళం కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు నేపథ్యంలో నమస్తే తెలంగాణతో ఆయన తన అభిప్రాయలను పంచుకున్నారు. 70 ఏళ్ల జగిత్యాల బల్దియా చర్రితలో ఒక్కసారి మినహా ప్రతి సారి కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉందని, 1981 తదుపరి మున్సిపాలిటీని పాలించిన పరిపాలకులు పూర్తిగా అభివృద్ధిని విస్మరించారన్నారు. స్వార్థపూరిత కాంగ్రెస్‌ నాయకుల వ్యవహారశైలి వల్ల జగిత్యాల మున్సిపల్‌ అభివృద్ధి మూడు అడుగులు ముందుకు అయితే ఆరు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగిందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ నుంచి మొదలు కొని, అంతర్గత రోడ్లు, ఉద్యానవనాలు, వైకుంఠధామాల అభివృద్ధి వరకు ఏ విషయంలోనూ పురోగతి లేకుండా పోయిందన్న ఎమ్మెల్యే, త్వరలోనే జగిత్యాల బల్దియాలో స్వర్ణయుగం ఆరంభం అవుతుందన్నారు. 48 వార్డులున్న జగిత్యాలలో నలబైకి పైగా వార్డులను టీఆర్‌ఎస్‌ శ్రేణు లు గెలుచుకోబోతున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాయికల్‌ మున్సిపాలిటీని సైతం గెలుస్తామన్న ఆయన, 2014 నుండి 2019 వరకు నిజమాబాద్‌ ఎంపీగా కొనసాగిన కల్వకుంట్ల కవిత చూపిన అభివృద్ధి మార్గంలో పయనిస్తామన్నారు. జగిత్యాల, రాయికల్‌ బల్దియాల గెలుపును మాజీ ఎంపీ కవితకు కానుకగా ఇస్తామన్నారు.

బల్దియా ఎన్నికల్లో గెలుపు  అవకాశాలు ఎలా ఉన్నాయి?

డాక్టర్‌ సంజయ్‌ : బల్దియా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని సాధించబోతున్నది. జగిత్యాల బల్దియాతో పాటు, రాయికల్‌ మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకోబోతున్నాం. జగిత్యాలలో 48 వార్డులు ఉంటే 40 స్థానాల్లో విజయం సాధిస్తాం. రాయికల్‌లో 12 స్థానాల్లో 10 స్థానాలు మా పార్టీ గెలుచుకుంటుంది.

కాంగ్రెస్‌ కంచుకోటను ఛేదిస్తున్నారా?

డాక్టర్‌ సంజయ్‌ : కచ్చితంగా ఛేదిస్తాం. జగిత్యాల కాంగ్రెస్‌ కంచుకోట అన్నది గతం. అసెంబ్లీ ఎన్నికలతోనే జగిత్యాలలో కాంగ్రెస్‌ పతనం ప్రారంభమైంది. నిజమాబాద్‌ ఎంపీగా కవిత పనిచేసిన కాలంలో ఆమె చూపిన అభివృద్ధి మార్గం, కాంగ్రెస్‌ పతనానికి నాంది పలికింది. దశాబ్దం క్రితం జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ తరుఫున ఏకైక కౌన్సిలర్‌ మాత్రమే ఉన్నారు. ఎంపీగా కవిత విజయం సాధించిన తర్వాత  ఆమె మార్గనిర్దేశనంలో జగిత్యాల పూర్తిగా గులాబీమయంగా మారిపోయింది. ఆమె కృషి ఫలితంగా ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు, జగిత్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపుకు ఆకర్షితులవుతున్నారు. బల్దియా ఎన్నికలతో జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.

2014 నుంచి జగిత్యాల, రాయికల్‌ పట్టణాల్లో అభివృద్ధి జరిగిందంటున్నారు? ఎన్ని నిధులు వచ్చాయి?, ఏ మార్పులు తెచ్చారు?

డాక్టర్‌ సంజయ్‌ : తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, నిజమాబాద్‌ ఎంపీగా కవిత బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే జగిత్యాల, రాయికల్‌ పట్టణాల్లో అభివృద్ధి ప్రారంభమైంది. అంతకు ముందు అరవై ఏండ్ల చరిత్ర ఉన్న జగిత్యాల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, జగిత్యాల పట్టణాభివృద్ధికి ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరయ్యాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా పట్టణాభివృద్ధికి ఐదుకోట్లు మంజూరయ్యాయి. టీయూఎఫ్‌ఐడీసీ ద్వార మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణాభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పట్టణంలో అన్ని మౌలిక వసతుల కల్పన చేస్తు న్నాం. జిల్లా కేంద్రంగా ఏర్పాటైంతర్వాత రూ.50 కోట్లతో కలెక్టర్‌ కార్యాలయంతో పాటు, ఇతర కార్యాలయాల నిర్మాణం చేపట్టాం.15 కోట్లతో నర్సింగ్‌ కాలేజీ పూర్తి చేశాం. 50 కోట్లతో హైమాస్ట్‌ లైట్లు, డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, ఫుట్‌ఫాత్‌ల నిర్మాణాలు చేస్తున్నాం. పోచమ్మవాడ, ధర్మపురి రోడ్డును రూ. 4.50 కోట్లతో పూర్తి చేసుకున్నాం. నిజామాబాద్‌-గుట్టరాజరాజేశ్వర స్వామి ఆలయం రోడ్డు పూర్తి చేశాం. గడియారం నుంచి కొత్తబస్టాండ్‌ వరకు ఉన్న రాంబజార్‌రోడ్డు, రామాటాకీస్‌ నుంచి ఎడ్ల అంగడి వరకు, టవర్‌ నుంచి మోచీ బజార్‌ వరకు ఉన్న రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా రూ.15 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. మోతె, గొల్లపల్లి రోడ్లలో ఉన్న శ్మశానవాటికలను ఆధునీకరించడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాయికల్‌ను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు రూ. 25 కోట్లను మంజూరు చేసి, అభివృద్ధి పనులు చేస్తున్నాం.

యావర్‌రోడ్డు విస్తరణపై విమర్శలు వస్తున్నాయిగా..?

డాక్టర్‌ సంజయ్‌ : యావర్‌రోడ్డు విస్తరణపై విమర్శలు చెత్త విమర్శలు. అసమర్థ నాయకులు లేవనెత్తిన పసలేని అంశం. 1969లోనే అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ రామకిష్టయ్య పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జగిత్యాల చుట్టూ వంద అడుగుల విస్తీర్ణంతో రింగ్‌రోడ్డును ప్రతిపాదించి ప్రభుత్వానికి ని వేదించారు. 1989 మార్చి 23న అప్పటి మున్సిప ల్‌ శాఖ జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం ఇచ్చిం ది. 30 ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు దాన్ని అమ లు చేయలేదు. జగిత్యాలకు వంద అడుగుల రింగ్‌రోడ్డు రాకుండా చేశారు. 50 ఏళ్ల కిత్రం ఉన్న నాయకులకు ఉన్న ఆలోచన ఇప్పటి కాంగ్రెస్‌ నాయకుల కు లేకపోవడం బాధాకరం. ముప్పై ఏళ్ల వారి పాలనలో మున్సిపల్‌ 60 ఏళ్ల్లు వెనక్కి వెళ్లింది. యావర్‌రోడ్డు విస్తరణ విషయం మాట్లాడుతున్న నాయకులు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేపట్టలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. యావర్‌రోడ్డు విస్తరణ ప్రణాళికాబద్దంగా చేపడుతాం. అందులో ఎలాంటి అనుమానం లేదు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కావడం లేదంటున్నారు? దీనిపై మీ స్పందన ఏమిటి?

డాక్టర్‌ సంజయ్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతున్నది.  ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాం. టెండర్‌ పూర్తయింది. పనులు జరిగాయి. అయితే అక్కడ నీటి వసతి లేకపోవడంతో కాంట్రాక్టర్‌ వెళ్లిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నూకపల్లి ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే మిషన్‌ భగీరథ నీళ్లను నూకపెల్లికి తీసుకువెళ్లి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి తీరుతాం.

మిషన్‌ భగీరథ నీరు ఎప్పుడు వస్తుంది?

డాక్టర్‌ సంజయ్‌ : మిషన్‌ భగీరథ ప్రధానమైన పనులు పూర్తయ్యాయి. దాదాపు ఏడాదిగా బల్క్‌వాటర్‌ జగిత్యాల పట్టణానికి డబ్బా నుంచి వస్తుం ది. అయితే అంతర్గత పైప్‌లైన్‌ నిర్మించే విషయంలో కొంత ఇబ్బంది నెలకొంది. రూ. 36 కోట్లతో అంతర్గత పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్‌ పూర్తి చేశాం. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్‌, మే మాసం నాటికి మిషన్‌ భగీరథ నీరు జగిత్యాల పట్టణంలో ప్రతి ఇంటికీ నళ్లాల ద్వారా అంది తీరుతుంది.
logo