మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 21, 2020 , 01:21:25

సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం

సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయం
  • -మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలి
  • -ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
  • -చివరి రోజు మెట్‌పల్లి, కోరుట్లలో విస్తృత ప్రచారం

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌: సబ్బం డ వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయమని ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొ న్నారు. సోమవారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని పట్టణంలో విస్తృతంగా నిర్వహించారు. పట్టణంలోని 14,15,23,26తో పాటు పలు వార్డు ల్లో   టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఏర్పా టు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆసరా పిం ఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, మిషన్‌ భగీరథ వంటి అనేక పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయన్నారు.  వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు రాయితీపై రుణాలు అందించి స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్లు తెలిపారు.  మెట్‌పల్లి పట్టణంలో రూ. 50 కోట్ల వ్య యంతో  ఆధునీకరణ, సుందరీకీకరణ పనులు చకచకా సాగుతున్నాయన్నారు. ఆరేండ్లలో మెట్‌పల్లిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను కౌన్సెలర్లుగా గెలిపించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే  అధిక నిధులు వస్తాయనీ, తద్వారా మ రింతగా అభివృద్ధి చేసుకునేందుకు  అవకాశం ఉంటుందని సూచించారు.  టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, ఆరేండ్ల పాలనలో నిరూపితమైందని పేర్కొన్నారు.  కోరుట్ల, మెట్‌పల్లి  మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను ఎగురవేసి సీఎం కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామ న్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజలంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను  గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయా సమావేశాల్లో  ఎమ్మెల్యే వెంట  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాన్కల గంగాధర్‌, పిప్పెర లలిత రాజేశ్‌, ఒజ్జెల బుచ్చిరెడ్డి, చెర్లపల్లి లక్ష్మిరాజేశ్వర్‌గౌడ్‌, ఆనంద్‌గౌడ్‌ నాయకులు  డా. సత్యనారాయణ, మాడిశెట్టి ప్రభాకర్‌పాల్గొన్నారు.

 కోరుట్లటౌన్‌ : పట్టణంలోని 10,27,31వ వార్డు ల్లో సోమవారం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఇం టింటా తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మె ల్యే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కారుగుర్తుకు ఓటు వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం గా పని చేస్తుందన్నారు.  పార్టీలకు అతీతంగా 33 వార్డులకు అభివృద్ధి నిధులు కేటాయించి ము రుగుకాల్వలు, అంతర్గత రహదారులు నిర్మించామన్నారు. పట్టణ సమాగ్రాభివృద్ధికి అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. అంతకుముందు 10వ వా ర్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలతో ర్యాలీ తీశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, రైతు సమన్వయసమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గడ్డమీది పవన్‌, గుండోజి శ్రీనివాస్‌, గుంటుక శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

logo
>>>>>>