ఆదివారం 29 మార్చి 2020
Jagityal - Jan 20, 2020 , 04:15:40

టీఆర్‌ఎస్‌ దూకుడు

టీఆర్‌ఎస్‌ దూకుడు
  • - హోరెత్తుతున్న గులాబీ సేన ప్రచారం
  • - వాడవాడనా ర్యాలీలు, ఊరేగింపులు
  • - నేటి సాయంత్రం 5వరకు ముగియనున్న ప్రచారం

 జగిత్యాల బృందం, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ‘కారు’ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారంతో పట్టణాలు హో రెత్తుతున్నాయి. కార్యకర్తలు, నాయకులు గడపగడపకూ వెళ్తూ ఓట్లు కోరుతున్నారు. జగిత్యాలలో ని 10, 13, 25, 26, 27, 30, 31, 34, 39, 42, 43 వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌కుమార్‌ విస్తృతంగా ప్రచారం చేశా రు. కోరుట్ల పట్టణంలోని 1,3, 24, 25, 28, 32వ వార్డుల్లో  పార్టీ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కలియదిరిగారు. మెట్‌పల్లి పట్టణంలోనూ జోరుగా ప్రచారం చేశారు.    
   

పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం..

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌తో సాధ్యమవుతుందని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత స్పష్టం చేశారు. 9వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొద్ది శ్రీలత-రామ్మోహన్‌ రావుకు మద్దతుగా ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే జగిత్యాల పట్టణాభివృద్ధి కుంటుపడిందని, నిజామాబాద్‌ పార్లమెంట్‌ మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సహకారంతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణాభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. జగిత్యాల ప్రజల చిరకా ల సమస్య అయిన యావర్‌రోడ్డు విస్తరణ పను లు సైతం ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రచారంలో బ్రహ్మాండభేరి నరేశ్‌, అనురాధ, జు బేర్‌, రాము, హర్షద్‌, అక్రమ్‌ తదితరులున్నారు.

ప్రచారంలో ఎమ్మెల్యే తనయుడు సంజయ్‌ ..

కోరుట్ల/కోరుట్లటౌన్‌ : కోరుట్ల పట్టణంలోని 10వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గడ్డమీద పవన్‌ను గెలిపించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయు డు కల్వకుంట్ల సంజయ్‌ స్థానిక కార్యకర్తలతో కలి సి  ప్రచారం చేశారు. 8వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెరుక మాదవి కాలనీవాసులతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. పట్టణంలోని 5, 9, 11వ వార్డుల్లోనూ సంజయ్‌ ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం దిశగా పరుగులు తీస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నెత్తిన బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరిన మహిళలు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పేర్ల సత్యం, కస్తూరి వాణి, పోగుల ఉమారాణి, గడ్డమీది పవన్‌ పాల్గొన్నారు.

మంత్రి కూతురు నందిని సైతం..

ధర్మపురి,నమస్తేతెలంగాణ: ధర్మపురిలోని పలు వార్డుల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కూతురు నందిని ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి పట్టంగట్టాలని కోరారు. తన తండ్రి ఈశ్వర్‌ ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌, మంత్రి హోదాల్లో ధర్మపురిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, పట్టణం మరింత  ప్రగతి సాధించాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట ఆయా వార్డుల అభ్యర్థులు సంగి సత్తెమ్మ, చిలువేరి నాగశ్వేత, అనంతుల విజయలక్ష్మి, బండారి అశోక్‌, జెట్టి విజయ, వొడ్నాల ఉమాలక్ష్మి తదితరులున్నారు.

ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు

జగిత్యాల రూరల్‌/రాయికల్‌రూరల్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల మండలం చల్‌గల్‌కు చెందిన యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎండీ జమీర్‌, ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌, నాయకులు ఎల్ల రాజన్న, ఆసిఫ్‌, సోహైల్‌, బండారి విజయ్‌ పాల్గొన్నారు. రాయికల్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు జగన్మోహన్‌, చంద జనార్ధన్‌ తమ అనుచరులతో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ వైశ్య సంఘం నాయకులు ఎనగందుల సత్యనారాయణ, గంప ఆనందం, తలారి రాజేశ్‌, ఏనుగు మల్లారెడ్డి, సామల్ల వేణు పాల్గొన్నారు. 
 

* నేడు ముగియనున్న ఎన్నికల ప్రచారం

గత వారం రోజులుగా రోజుగా సాగిన ప్రచారం ఎన్నికల నిబంధనల ప్రకారం నేటి సాయంత్రం 5వరకు ముగియనున్నది. ఈనెల 22న ఎన్నికలు ఉన్న సందర్భంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలున్న సంగతి తెలిసిందే.logo