శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jagityal - Jan 20, 2020 , 04:13:52

బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండినే

బల్దియాలపై ఎగిరేది గులాబీ జెండినే(జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ)
తన నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానేనని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడిన ఆ యన, పలు అభిప్రాయాలను పంచుకున్నారు. సాధారణ వ్యక్తులు ఊహించని రీతిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసిందన్నారు. విద్యుత్‌ నుంచి మొదలుకొని విద్యవరకు, పరిశ్రమల నుంచి మొదలు ఆరోగ్యం వరకు అన్ని రంగాల్లోనూ తెలంగాణను సీఎం కేసీఆర్‌ దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిపారన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి?

కల్వకుంట్ల : వందశాతం విజయావకాశాలు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఇప్పటికే కోరుట్లలోని మూడు వార్డుల్లో, మెట్‌పల్లిలోని ఒక వార్డులో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

59 వార్డుల్లో ఎన్నింట్లో విజయం సాధిస్తారని అనుకుంటున్నారు?

కల్వకుంట్ల : రెండు పట్టణాల్లోని 59వార్డుల్లో వంద శాతం టీఆర్‌ఎస్‌దే గెలుపు. ఇప్పటికే నాలుగు వార్డులు గెలిచాం. మిగిలిన 55 కూడా కైవసం చేసుకుంటాం. ప్రతిపక్షాల పోటీ నామమాత్రమే. కేవలం ఉనికి కోసమే బరిలో నిలిచారు.          

వందశాతం గెలుపు నమ్మకానికి కారణాలు?

కల్వకుంట్ల : సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకా లే మా విజయ సోపానాలు. ఈ ఐదున్నరేళ్లలో అనేక పథకాలను విజయవంతంగా అమలు చేశాం. 24 గం టల విద్యుత్‌, రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, ఆసరా పింఛన్లు ఇలా ప్రతి పథకం ప్రజలకు ఎంతో మేలు చేసింది. ప్రభుత్వ వైద్యశాలలు మె రుగయ్యాయి.  చిన్నతరహా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన లాంటివి కార్మికులకు మేలు చేశాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మాకు గెలుపును అందించాయి. ఇప్పుడూ అందించబోతున్నాయి.  

రెండు పట్టణాల్లో అభివృద్ధి ఎలా ఉన్నది?

కల్వకుంట్ల : కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో  ఐదేళ్లలో  అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయి. చరిత్రల్లో ఏ నాడూ రానన్ని నిధులు ఈ ఐదేండ్లలోనే వచ్చాయి. గ తంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయేది. స్థానిక సంస్థల, ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం, ముఖ్యంగా మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కొత్త ఒరవడికి నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి మున్సిపాలిటీలకు నేరుగా నిధులిచ్చే ప్రక్రియ మొదలు పెట్టారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల కు రూ.50కోట్ల చొప్పున మంజూరు చేశారు. వీటితో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.  రెండు పట్టణాల్లో రూ.7కోట్ల తో మినీ ట్యాంక్‌ బండ్లు ని ర్మించాం. రెండు చెరువుల్లో  బోటింగ్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. ఓపెన్‌ జిమ్‌లు, ఏర్పాటు చేశాం.  కో రుట్ల, మెట్‌పల్లి రెండూ నేషనల్‌ హైవేపై ఉన్న పట్టణా లు. కానీ, నేషనల్‌ హైవే నుంచి వీటిని డిలీట్‌ చేశారు. దీంతో పట్టణాల్లో ప్రధాన రోడ్డును రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే బాగు చేయిస్తున్నాం. రోడ్డు మధ్య డివైడర్లు, మధ్యలో గ్రీనరీ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, చౌరస్తాల్లో హైమాస్ట్‌ లైట్ల పనులు జరుగుతున్నాయి. 

అంతర్గత రోడ్ల విస్తరణపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?

కల్వకుంట్ల : అంతర్గత రోడ్ల విస్తరణ, సీసీరోడ్ల కోసం టెండర్‌ ప్రక్రియ ముగిసింది. పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి. రెండు పట్టణాల్లో ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తాం.

మిషన్‌ భగీరథ నీరు ఆలస్యమవుతున్నదని విమర్శలు వస్తున్నాయి?

కల్వకుంట్ల : మిషన్‌ భగీరథ బల్క్‌ వాటర్‌, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు ఇప్పటికే అందుతున్నది. ఇంటింటికీ నీరందించే ప్రక్రియ కాస్త ఆలస్యమవుతున్నది. అంతర్గత పైప్‌లైన్‌, నల్లాలు బిగించేందుకు హక్కులు పొందిన కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేశాం. కొత్తగా టెండర్లు పిలిచారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలస్యమైంది. ఫిబ్రవరి వరకు అగ్రిమెంట్‌ పూర్తవుతుంది. వచ్చే ఏప్రిల్‌, మే వరకు రెండు పట్టణాల్లో ప్రతి ఇంటికీ నీరందుతుంది.  అన్ని కుల సంఘాలకూ నిధులు కేటాయించాం. కొన్ని కులాల వారు మిగిలిపోయారు. వారికి కూడా సంఘ భవనాల కోసం నిధులు మంజూరు చేస్తాం.

ఎన్నికల్లో ప్రజాదరణ ఎలా ఉంది?

కల్వకుంట్ల : ప్రజల నుంచి బ్రహ్మాండంగా ఆదరణ లభిస్తున్నది. ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం పలుకుతున్నారు. అసలు మాకు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్లు అనిపించడం లేదు. విజయోత్సవ ర్యాలీలకు వెళ్తున్నట్లు అనిపిస్తున్నది. కేసీఆర్‌ పథకాలు అద్భుతమైన వి. అలాంటి పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలు ఇ తర పార్టీలను కనీసం గుర్తించడం లేదని తెలుస్తున్నది. 


logo