ఆదివారం 24 మే 2020
Jagityal - Jan 20, 2020 , 04:04:07

రైతుల కల సాకారం

రైతుల కల సాకారం
  • -బీడు భూములు ఇక సాగులోకి
  • -అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌
  • -అందుకే వారి ఇబ్బందులు తొలగిస్తున్నారు
  • -ఆయన నాయకత్వంలో పనిచేయడం నా అదృష్టం
  • -ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
  • -తొంబర్రావుపేటలో ఎస్సారెస్పీ -కాలువకు తూము ప్రారంభం
  • -పాల్గొన్న మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి

మేడిపల్లి : ఎస్సారెస్పీ కాలువకు ‘డీ-52 ఓటీ స్లూయిస్‌' తూము నిర్మాణంతో రైతుల 40ఏండ్ల కల సాకారమైందని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. మేడిపల్లి మండలం తోంబర్‌రావుపేట శివారులో ఎస్సారెస్పీ కాలువకు రూ.40లక్షలతో నిర్మించిన ఈ తూమును మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావుతో కలిసి ఆదివారం ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. తూము తలుపును పైకి తీసి పిల్లకాలువలోకి నీటిని వదిలి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటి పాలకులు ఎస్సారెస్పీ డీ-51, డీ-53లను నిర్మించి డీ-52 అవసరం లేదని నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. రైతులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు దృష్టికి, తన దృష్టికి తెచ్చారని తెలిపారు. వెంటనే నాడు ఎంపీగా ఉన్న కల్వకుంట కవితను సంప్రదించి లెటర్‌ ఇచ్చామనీ, ఆమె వెంటనే స్పం దించి నిధుల మంజూరు కోసం కృషి చేశారని చెప్పారు.

తూము నిర్మాణంతో మేడిపల్లి మండలంలోని తోంబర్‌రావుపేట చెరువు, పోరుమల్ల చెరువు నిండి రాయికల్‌ మండలంలోని మైతాపూర్‌, రాయికల్‌ పెద్ద చెరువు, కొత్తపేట, మూటపెల్లి  చెరువులు నిండుతాయని రెండు మండలాల్లో భూములు సాగులోకి వచ్చి సస్యశ్యామలమవుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు రా వడం లేదని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారని, పునర్జీవం పథకంతో గ్రామాల్లో చెరువులు నిండాయని, కాంగ్రెస్‌ నేతలు కండ్లు తెరిచి చూడలన్నారు. మిషన్‌ కాకతీయ, హరితహారం కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరాధ్యుడయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడం తన ఆదృష్టమని తెలిపారు. నాడు ఎంపీ కవితతో కలిసి పసుపు మద్దతు ధర కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లెట ర్‌ ఇచ్చామని, కేంద్రం స్పందించలేదని చెప్పారు. కవితను ఓడించి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజ లు మోసపోయారని, మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు.

డీ-52 తూము నిర్మాణానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి మాట్లాడుతూ ము ఖ్యంత్రి కేసీఆర్‌ రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కా బట్టే 40 ఏండ్ల కలను ఈ రోజు సాకారం చేశారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ సహకారంతోనే డీ-52 తూము నిర్మితమైందని పేర్కొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి, కథలాపూర్‌ ఎంపీపీలు దో నకంటి ఉమాదేవి, జవ్వాజి రేవతి, సర్పంచ్‌లు మామిడి సత్తవ్వ, గడ్డం నారాయణరెడ్డి, ఈర్నాల సంపత్‌కుమార్‌, ఎంపీటీసీ మకిలి దాస్‌, కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ హైమద్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మిట్టపెల్లి భూమారెడ్డి, ఉపసర్పంచ్‌ నూతిపెల్లి శంకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు అంకం విజయసాగర్‌, నాయకులు దోనకంటి రాజరత్నకర్‌రావు, ప న్నాల రాజేశ్వర్‌రెడ్డి, మామిడి ధర్మారెడ్డి, వీరబత్తిని ఆంజనేయులు, తోకల రవీందర్‌, వొద్దినేని నాగేశ్వర్‌రావు, దోనకంటి వంశీ, చెట్టె గంగారాజం, నల్ల మహిపాల్‌రెడ్డి, మజీద్‌ పాల్గొన్నారు.      logo