గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 19, 2020 , 00:02:54

‘కొండ’ంత సందడి

‘కొండ’ంత సందడి


 మల్యాల :  కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తులతో రద్దీ నెలకొంది. సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో సమీప ఆలయాలను దర్శించుకునే క్రమంలో కొండగట్టు ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.  ఈ సందర్భంగా భక్తులు శుక్రవారం రాత్రి నుంచే ఆలయ పరిసరాల్లో బస చేసి, శనివారం ఉదయం నుంచే కోనేరులో స్నానాలు చేసి స్వామి వారి దర్శనానికి భారులు తీరారు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి వారితో పాటు అనుబంధ ఆలయాలైన బేతాళ స్వామి, మునిగుహలు, కోదండ రామాలయం, కొండల రాయుడి అడుగులు, బొజ్జ పోతన తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.  ఆలయ ప్రకార మండపంలో పలువురు భక్తులు స్వామి వారికి అభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతం, హారతి తదితర ప్ర త్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఈ సం దర్భంగా ఆలయ అధికారులు భక్తుల  కు సకల సౌకర్యాలు కల్పించారు. భక్తులకు సౌకర్యవంతం గా ఉండేందుకు గానూ మల్యాల మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాల స్కౌట్‌ విద్యార్థులను ఆల యం తరఫున సేవలను వినియోగించుకున్నట్లు ఏఈవో శ్రీనివాస్‌ తెలిపారు. సుమారు 30వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయానికి సుమారు రూ.6లక్షల పైచిలుకు ఆదాయం సమకూరినట్లు తెలిపారు.  ఆల య సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ శర్మ, అంజ య్య, ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రా వు, సంపత్‌, ఆల య సిబ్బంది సునిల్‌, కాసర్ల శ్రీనివాస్‌, లక్ష్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, జెమిని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo