బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 19, 2020 , 00:01:44

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి

ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి


జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. జిల్లాలోని మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సిబ్బందికి సుమంగళి గార్డెన్స్‌లో శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్‌కు కావాల్సిన సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లకు శిక్షణ పొందిన వారిని కౌంటింగ్‌కు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు తెలుసుకున్నారు. బ్యాలెట్‌ పేపర్స్‌ ఎలా లెక్కిస్తారు, వాటి విధానం, చెల్లని ఓట్లపై పోస్టల్‌ బ్యాలెట్‌పై సందేహాలు కలిగిన ఓటుపై తీసుకోవాల్సిన చర్యలు, మల్టిపుల్‌ ఓటుపై శిక్షణ పొందిన వారి నుంచి వివరాలు  తెలుసుకు న్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరు కౌంటింగ్‌ హాల్‌లో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఫోన్లు మాట్లాడకూడదనీ, ఒకవేళ ఫోన్‌ తీసుకొస్తే కౌంటర్‌లో ఇచ్చేయాలన్నారు. బయటికి వెళ్లకూడదని, కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో ఎలాంటి మాటలు ఇతరులతో మాట్లాడకూడదన్నారు. 

ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ రోజు ఉదయం 6గంటలకు తప్పకుండా విధిగా హాజరుకావాలని సూచించారు. ఎవరైనా ఎలాంటి పొరపాట్లు చేసినా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రతి ఉద్యోగి ఏ శాఖలో పనిచేసినా అందరు ఎన్నికల కమిషన్‌ దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్నట్లుగా భావించి ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అందరు శ్రద్ధ్దతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ బేతి రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, ఆర్డీవో నరేందర్‌, ఐదు మున్సిపాలిటీల కమిషనర్లు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>