బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 18, 2020 , 04:19:52

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
  • -అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
  • -మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలి
  • -ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
  • -కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో విస్తృత ప్రచారం
  • -వార్డుల్లో ప్రజల సాదర స్వాగతం

కోరుట్లటౌన్‌: అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని 9, 20, 24, 27వార్డుల్లో ఎమ్మెల్యే శుక్రవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటా తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడురూం ఇళ్లు నిర్మించి ఇస్తుందని పేర్కొన్నారు. ఇందుకు వచ్చే బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించనుందని చెప్పారు. సొంత స్థలం కలిగిన కుటుంబాలకు ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల సాయమందిస్తామని పేర్కొన్నారు. పట్టణ శివారు పశు వైద్య కళాశాల సమీపంలో 350డబుల్‌ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, లాటరీ పద్ధతిలో ఇళ్లు లేని వారికి కేటాయించనున్నట్లు తెలిపారు. మార్చి చివరినాటికి మిషన్‌ భగీరథ శుద్ధ జలాలను నల్లాల ద్వారా ఇంటింటికి అందించనున్న ట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో పీఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులు, 57ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ అందిస్తామన్నారు.

సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన వ ర్గాల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, లబ్ధి పొందని కుటుంబ మంటూ రాష్ట్రంలో లేదన్నారు. మునుపెన్నడు లేని విధంగా కోరుట్ల పట్టణాభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. పార్టీలకు అతీతంగా 31వార్డులకు నిధు లు కేటాయించామన్నారు. అన్ని వార్డుల్లో మురుగుకాల్వలు, అంతర్గత రహదారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో కోరుట్ల ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చామని, ప్రభుత్వ సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని వంద పడకలకు విస్తరిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోగుల ఉమారాణి, గంధం గంగాధర్‌, గుడ్ల లక్ష్మి, గుండోజి శ్రీనివాస్‌కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకటరావు, ఏఎంసీ మాజీ అధ్యక్షు డు సింగిరెడ్డి నారాయణరెడ్డి, సాయిబాబా ఆల య అధ్యక్షుడు పోతని భూమయ్య, మాజీ కౌన్సిలర్‌ గుండోజి మహేశ్వరి, నాయకులు పోగుల లక్ష్మీరాజం, అల్వాల శ్రీనివాస్‌, శంకర్‌, బింగి రాజు, పాతర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.  
టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌: ప్రజా సంక్షేమం, అభివృద్ధి  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 1,2,7,8,9, 10,18 వార్డుల్లో విస్త్రృత ప్రచారం నిర్వహించారు. పలు వీధుల్లో ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కౌన్సిలర్లుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో మాట్లాడుతూ.. గడిచిన ఐదేండ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. పట్టణంలోని అర్హులైన ప్రతినిరుపేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లును పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ఇప్పటికే పట్టణ శివారులోని అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో 350 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. ఉగాదికల్లా అర్హులందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్ల ఆధునీకరణ, డ్రైనేజీల విస్తరణ, వీధి దీపాలు, చిల్డ్రన్‌పార్క్‌,  సీసీ రోడ్లు,  శ్మశాన వాటికలు, ఇతరత్రా అనేక అభివృద్ధి పనులు రూ.50 కోట్ల వ్యయంతో చకచకా కొనసాగుతున్నాయన్నా రు.

 అన్ని వార్డులను అభివృద్ధి చేయడంతోపాటు  ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ట్లు తెలిపారు. అధికార పార్టీ  అభ్యర్థులను  గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.  మరోసారి మెట్‌పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురాలని,  ప్రజలంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  అంతకుముందు  ఆయా కాలనీల ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగ తం పలికారు. ఎమ్మెల్యే వెంట  ఆయా వార్డుల టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థులు తిరుసుల్ల లక్ష్మీనర్సు, జక్కం నర్సయ్య (బాబు), మన్నెఖాన్‌, మాసం గంగారెడ్డి, మార్గం గంగాధర్‌, బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, బొర్రొళ్ల గంగారాం, నాయకులు అర్జున్‌, మైలారపు లింబాద్రి, సోహైల్‌, షేక్‌ మహ్మద్‌, ఎ నుగందుల వనజాశ్రీనివాస్‌గౌడ్‌, జావీద్‌, కందరి ప్రతాప్‌రెడ్డి, రాజ్‌మహ్మద్‌,  నేమూరి సత్యనారాయణ, జేడీ సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>