మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 18, 2020 , 04:17:47

ప్రతి గుండెనూ తట్టేలా పథకాలు

ప్రతి గుండెనూ తట్టేలా పథకాలు
  • -చిత్తశుద్ధితో అమలు చేస్తున్న సర్కారు
  • -అన్ని మండలాలకు రూ.25లక్షల చొప్పున మంజూరు చేయిస్తాం
  • -కోటిలింగాలను పర్యాటక కేంద్రంగా మారుస్తాం
  • - రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • - వెల్గటూర్‌లో జేసీ రాజేశం ఆధ్వర్యంలో భూ సమస్యల పరిష్కార సదస్సు
  • - సమస్యలకు నెలలో పరిష్కారం చూపిస్తామని హామీ

వెల్గటూరు : ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గుండెను తట్టేలా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. వెల్గటూరు మండల కేంద్రంలో జాయిం ట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భూ సమస్యల పరిష్కార సదస్సు కు మంత్రి  హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పలురకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, చిత్తశుద్ధితో అమలుచేస్తూ ప్రజల మనన్నలు పొందుతున్నదన్నారు. ఎక్కడా లేనివిధంగా రైతుబీమా పథకాన్ని అమలుచేస్తూ రైతు కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో భూసమస్యల పరిష్కారం కోసం  ప్రత్యేకం గా జమీన్‌బందీ కార్యక్రమాన్ని అమలు చేసి వేలాదిమంది రైతుల భూ సమస్యలను పరిష్కరించామని గుర్తుచేశారు. వెల్గటూరులో కొంతమందికి సంబంధించిన పట్టాభూములు అయినా            రికార్డుల్లో అసైన్డ్‌ భూములుగా చూపిస్తున్నాయని వాటికి నెలలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కోటిలింగాలను పర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని  పేర్కొన్నారు. కోటిలింగాల కమాన్‌కు సమీపంలో రూ.30కోట్లతో హరితహోటల్‌ ఏర్పాటయ్యేలా చూస్తానన్నారు. వెల్గటూరులో లైబ్రరీ నిర్మాణం కోసం రూ.20లక్షలు, కూరగాయల మార్కెట్‌ ఏర్పాటుకోసం రూ. 30లక్షలు, పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామం పూర్తి కోసం రూ.15లక్షలు, బస్టాండ్‌ వద్ద సులబ్‌ కాంప్లెక్సు నిర్మాణంకోసం రూ.5లక్ష లు మంజూరు చేయిస్తానన్నారు. ప్రభుత్వం ప్రతి పంచాయతీకి రూ.10లక్షల నిధులు కేటాయించిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మా ట్లాడి ధర్మపురి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలకు రూ.25లక్షల చొప్పున నిధులు మం జూరు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధిపై నాయకులు గ్రామాల్లో గల పజలకు వివరించాలని సూచించారు.

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు వరంలాంటివని మంత్రి  ఈశ్వర్‌ పేర్కొన్నారు. 13మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను వెల్గటూరులో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద కుటుంబాలకు పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ప్రభుత్వాన్ని  ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జడ్పీ సభ్యురాలు సుధారాణి, వైస్‌ ఎంపీపీ ముస్కు కవిత, జాయింట్‌ కలెక్టర్‌ రాజేశం, తాసిల్దార్‌ రాజేందర్‌, ఎంపీడీవో సంజీవరావు, ఎంపీటీసీ పెద్దూరి హారిక, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏలేటి కృష్ణారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్‌ పొనుగోటి రాంమోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్‌గౌడ్‌, నాయకులు దొరిశెట్టి వెంకటయ్య, గండ్ర నర్సింగరావు,  సింహాచలం జగన్‌, కొప్పుల సురేశ్‌, పెద్దూరి భరత్‌, బొడ్డు రామస్వామి పాల్గొన్నారు.   

మంత్రిని కలిసిన గుల్లకోట,     చెర్లపల్లి రైతులు

వెల్గటూర్‌ మండలంలోని చెర్లపల్లి, గుల్లకోట గ్రామాల రైతులు మంత్రి ఈశ్వర్‌ను కరీంనగర్‌లో శుక్రవారం కలిశారు. చెర్లపల్లి, గుల్లకోట, ఎండప ల్లి, కొండాపూర్‌లో పంటలకు ఎస్సారెస్పీ కాలువ నీరు  అందడం లేదని దృష్టి తీసుకెళ్లారు. పెగడప ల్లి మండలం రంగధాముని పల్లెలో చెరువు నుంచి డీ 83-ఏ కాలువకు నీటిని విడుదల చేసేలా చూ డాలని కోరారు. ఈమేరకు మంత్రి స్పందించి ఎ స్సారెస్పీ ఈఈతో ఫోన్లో మాట్లాడారు. రంగధాముని పల్లెలో చెరువు నుంచి డీ 83-ఏ కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఇక్కడ మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ రియాజ్‌, నాయకులు పొన్నం తిరుపతి, పడిదం నారాయణ, వెంకటేశ్‌, సిగిరి ఆనంద్‌, శ్రీనివాస్‌, ఉప్పల లచ్చయ్య, జల్లెల కనకయ్య, మాదాసు గంగయ్య, బట్టు రామస్వామి, రామగిరి మల్లేశ్‌, అంజయ్య పాల్గొన్నారు.
logo
>>>>>>