మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 17, 2020 , 01:04:18

గులాబీ హోరు.. ప్రచార జోరు

గులాబీ హోరు.. ప్రచార జోరు
  • - ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు కోరుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు
  • - ఐదు మున్సిపాలిటీల్లో ఉధృతంగా ప్రచారం
  • - జగిత్యాలలోని పలు వార్డుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
  • - మెట్‌పల్లి, కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
  • - ధర్మపురికి తరలిన వెల్గటూర్‌, గొల్లపల్లి, పెగడపల్లి నేతలు

జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి/నమస్తే తెలంగాణ/కోరుట్ల టౌన్‌/రాయికల్‌: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అ భ్యర్థులు ఉధృతం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఇప్పటికే పలు వార్డుల్లో తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలపు కో సం కృషి చేస్తున్నారు. ఇటు కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీఆర్‌ఎస్‌ విజయం కోసం ప్రచారాన్ని ఉధృతం చేయడంతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేష కృషి చేస్తున్నారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈ శ్వర్‌ ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వెల్గటూర్‌, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్మపురికి వెళ్లి బ ల్దియా పరిధిలో పార్టీ అభ్యర్థుల కోసం జోరుగా ఎ న్నికల ప్రచారం చేశారు. ఇటు కథలాపూర్‌ నుంచి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలకు వేములవాడకు వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు.

జగిత్యాల పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం : ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌ సర్కారుతోనే సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ము న్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని 5, 21, 33 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల బల్దియాపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అర్హత గల ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, పట్టణంలో ప్రధాన సమస్య అయిన యావర్‌ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, రూ. 50 కోట్లతో పట్టణ సుందరీకరణ పనులు,  మున్సిపల్‌ పార్కులో ఓపెన్‌ జిమ్‌, శ్మశాన వాటికల పనులు చేపడుతున్నామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని జరిగిన అభివృద్ధే నిరూపిస్తున్నదని గుర్తు చేశారు. న్నారు. జగిత్యాల మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 5, 21, 33 వార్డుల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రాచర్ల విజయ్‌, అల్లె సాగర్‌, బండారు రజిని నరేందర్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల దూకుడు

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బుధ, గురువారాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. 36వ వార్డులో అడువాల జ్యోతి-లక్ష్మణ్‌, 9వ వార్డులో వొద్దినేణి లత-రాంమోహన్‌రావు, 24వ వార్డులో చందా పృథ్వీధర్‌రావు, 3వ వార్డులో చదువుల తిరుమలమ్మ-కోటేశ్వర్‌రావు, 4వ వార్డులో క్యాదాసు నవీన్‌, 44వ వార్డులో గోలి శ్రీనివాస్‌, 17వ వార్డులో సిరికొండ పద్మ-సింగారావు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రచారం

-  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలంటూ విన్నపం
జగిత్యాల రూరల్‌ : జగిత్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు పట్టణంలోని 2,17,18 వార్డుల్లో గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. మూడు వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జగిత్యాల పట్టణంలో పలు సమస్యలు తిష్ట వేశాయని, ఈ సారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని, టీఆర్‌ఎస్‌తోనే జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో 2వ వార్డు అభ్యర్థి బద్దం లతా-జగన్‌రెడ్డి, 17వ వార్డు అభ్యర్థి సిరికొండ పద్మ-సింగారావు, 18వ వార్డు అభ్యర్థి చుక్క నవీన్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ వెంటే ఉంటా..

-  జగిత్యాల 15వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తోట మల్లికార్జున్‌
అర్బన్‌/జగిత్యాల టౌన్‌ : ‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని..మీ వెంటే ఉంటా..సత్వరమే స్పందించి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సహకారంతో సమస్యలు పరిష్కారిస్తా..నన్ను ఆశీర్వదించి ఓటు వేసి కౌన్సిలర్‌గా గెలిపించండి” అంటూ జగిత్యాల మున్సిపాలిటీ 15వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తోట మల్లికార్జున్‌ విజ్జప్తి చేశారు.వార్డులో తన అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధారిత కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల సమస్యలు తెలుసునని, రైతుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.వార్డులో విద్యార్థుల ఉన్నత విద్యకు కృషి చేస్తానని, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు దరిచేరుస్తానని హామీ ఇచ్చారు. వార్డులో శ్మశాన వాటికపై గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, వారు అసూయపడేలా శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తానని,  ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ మంచినీరందేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. 

ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

- 1వ వార్డు అభ్యర్థి కూసరి అనిల్‌కుమార్‌
జగిత్యాల క్రైం : తనను ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని ఒకటో వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూ సరి అనిల్‌కుమార్‌ హామీ ఇచ్చారు. జగిత్యాల పట్టణంలోని 1వ వార్డులో బుధ, గురు వారాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. అందుబాటులో ఉంటూ వార్డులోని సమస్యలను పరిష్కరిస్తానని, తెలంగాణ సర్కారు అం దించే సంక్షేమ పథకాలను  ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సహకారంతో ప్రజల దరిచేరుస్తానని ప్రకటిస్తూ తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

 46వ వార్డు అభ్యర్థి అనుమల్ల పద్మావతి-వెంకటరమణ
జగిత్యాల క్రైం : వార్డు, జగిత్యాల పట్టణాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని 46వ వార్డు అభ్యర్థి అనుమల్ల పద్మావతి-వెంకటరమణ పేర్కొన్నారు. 46వ వార్డు పరిధిలోని పురాణిపేట, గా జుల పోచమ్మవాడ, రాంబజార్‌లో బుధ, గురువారాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గత మున్సిపల్‌ పాలకుల నిర్లక్ష్యం వల్ల జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధికి నోచుకోకుండా పో యిందని, రాబోయే టీఆర్‌ఎస్‌ పాలకవర్గంలో 46వ వార్డుతో పాటు, జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.  కార్యక్రమంలో వెంకటరమణ, రంగు రాజయ్య, బట్టు ప్రవీణ్‌, సూర్యప్రకాశ్‌, సంకోజు వెంకటరమణ, గాజుల శ్రీనివాస్‌, సాయికుమార్‌, సంజయ్‌ సామ్రాట్‌ పాల్గొన్నారు.

సమస్యలన్నీ పరిష్కరిస్తా


- 45వ వార్డులో ఇస్త్రీ చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న బోడ్ల జగదీశ్‌

జగిత్యాల క్రైం : జగిత్యాల మున్సిపాటిలోని 45 వార్డులో తనను గెలిపిస్తే వార్డులోని సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోడ్ల జగదీశ్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగిత్యాల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పాలకవర్గం ఏర్పాటైతేనే వార్డుతో పాటు పట్టణ సమస్యలన్నీ తొలగిపోతాయని, వార్డు నుంచి తనను కౌన్సిలర్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. logo
>>>>>>