శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Jan 15, 2020 , 01:47:44

130 వార్డులు 562 మంది అభ్యర్థులు

130 వార్డులు 562  మంది అభ్యర్థులు
  • ‘పుర’బరిలో నిలిచింది వీరే

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 134వార్డుల్లో నాలుగు ఏకగ్రీవం కాగా 130వార్డులకు 564మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది. జగిత్యాలలో 48వార్డులకు 194మంది, కోరుట్లలో 33వార్డులకు మూడు ఏకగ్రీవం కాగా 30వార్డులకు 136, మెట్‌పల్లిలో 26వార్డులకు ఒకటి ఏకగ్రీవం కాగా 25వార్డులకు 123, ధర్మపురిలో 15వార్డులకు 51, రాయికల్‌లో 12వార్డులకు 58మంది పోరులో నిలిచినట్లు వెల్లడించింది. ఇక ఎన్నికల ప్రచారం జోరందుకోనుండగా అప్పుడే పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

-జగిత్యాలలో 194మంది
-కోరుట్లలో 136.. మెట్‌పల్లిలో 123
-ధర్మపురిలో 51..రాయికల్‌లో 58మంది
-కోరుట్లలో మూడు, మెట్‌పల్లిలో ఒక వార్డు ఏకగ్రీవం
-నాలుగు వార్డులూ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి
-ఇక జోరందుకోనున్న ప్రచారం
-పట్టణాల్లో వేడెక్కిన రాజకీయ వాతావరణం

 జగిత్యాల/మెట్‌పల్లి/ధర్మపురి,నమస్తే తెలంగాణ/జగిత్యాల అర్బన్‌, కోరుట్లటౌన్‌/మెట్‌పల్లిటౌన్‌/రాయికల్‌: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలిం ది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ అ నంతరం 134వార్డుల్లో నాలుగు ఏకగ్రీవం కాగా 130వార్డులకు 564మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది.
జగిత్యాలలో 194 మంది అభ్యర్థులు
జగిత్యాల మున్సిపాలిటీలో 48వార్డులు 194 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా 48 వార్డులుకు 456 నామినేషన్లు రాగా, 14న నామినేషన్ల ఉప సంహరణకు చివరి గడువు కావడంతో పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తర్వాత 277మంది ఉండగా మంగళవారం 83మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 194మంది బరిలో ఉన్నట్లు మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి లచ్చిరెడ్డి  తుది జాబితాను మంగళవారం ప్రకటించారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 48మంది, కాం గ్రెస్‌ నుంచి 48మంది, బీజేపీ నుంచి 37మంది, ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు, ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ఒకరు, బీసీ యునైటెడ్‌ ఫ్రం ట్‌ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఇద్దరు, టీజేఎస్‌ నుంచి ఒకరు, స్వతంత్రులు 51మంది ఉన్నారు.         

కోరుట్లలో 136మంది..

కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో 33వార్డులు ఉండ గా మూడు వార్డులకు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 30వార్డులకు 136 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు కమిషనర్‌ అయాజ్‌ తెలిపారు. వీరిలో  కాంగ్రెస్‌ నుంచి 20 మంది, బీజేపీ నుంచి 24మంది, ఎంఐఎం నుంచి తొమ్మిది మంది, సీపీఐ (ఎం) నుంచి ఒకరు, స్వతంత్రులు 52 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.           

మెట్‌పల్లిలో 123మంది ..

మెట్‌పల్లి పట్టణంలో 26 వార్డులకు గాను 19వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రానవేణి సుజాత ఏకగ్రీవం కాగా,  మిగతా 25 వార్డుల్లో  123 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సబ్‌ కలెక్టర్‌ గౌ తం పొత్రు వెల్లడించారు. మొదట మొత్తం వార్డులకు 170 మంది అభ్యర్థులు, 270 నామినేషన్లు వేశారు.  ఉప సంహరణ  ప్రక్రియలో భా గంగా  ఈ నెల 13న 8 మంది, 14న 38 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఒకవార్డు ఏకగ్రీవం కాగా 25వార్డులకు  టీఆర్‌ఎస్‌ నుంచి 25మంది, బీజేపీ నుంచి 24మంది, కాంగ్రెస్‌ నుంచి 17మంది,  ఎంటీఆర్‌ఎస్‌ నుంచి ఐదుగు రు, ఎంఐఎం నుంచి ఐదుగురు, టీజేఎస్‌ నుంచి ఒకరు, పీఎస్‌పీ నుంచి నలుగురు, స్వతంత్రులు 42 మంది పోటీలో ఉన్నారు.  

ధర్మపురిలో 51మంది..

 ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు మొత్తం 72 మంది నామినేషన్లు దాఖలు చేయ గా, ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 51 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉపసంహరణ చివరి రోజున 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. ఈనెల 11న నలుగురు, 12న ఐదుగురు, 13న ముగ్గురు, 14న 9 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 72 మందిలో 21 మంది ఉపసంహరించుకోగా 51 మంది బరిలో నిలిచారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 15మంది, కాంగ్రెస్‌ నుంచి 15మంది, బీజేపీ నుంచి 11మంది, ఇతరులు 10మంది ఉన్నారు.        

రాయికల్‌ బరిలో 58మంది..

రాయికల్‌ మున్సిపాలిటీలో 12వార్డులకు 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి 12మంది, బీజేపీ నుంచి 12మంది, కాంగ్రెస్‌ నుంచి 12మంది, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి నలుగురు, స్వతంత్రులు 18మంది ఉన్నారు.


logo