సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 15, 2020 , 01:46:10

సంబూరాల సంక్రాంతి

సంబూరాల సంక్రాంతి
  • - భోగితో మొదలైన సందడి
  • - నేడు మకర సంక్రాంతి, రేపు కనుమ
  • - పిల్లాపాపలతో ఇళ్లకు కొత్త కళ
  • - ముగ్గులతో పూదోటలా వాకిళ్లు
  • - ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు
  • - ఆకాశాన ఎగురుతున్న పతంగులు
  • - ఆకట్టుకుంటున్న గంగిరెద్దుల విన్యాసాలు
  • - కళకళలాడుతున్న గ్రామాలు

జగిత్యాల, నమస్తే తెలంగాణ: ధనుర్మాసం ము గిసి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు ను మకర సంక్రాంతిగా పిలుస్తారు. భానుడు ద క్షిణాయణం చాలించి, ఉత్తరాయణంలోకి అడుగుపెట్టే సంక్రాంతి పర్వదినాన్ని బుధవారం ఘనంగా జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు. భోగి పండుగను మంగళవారం వైభవంగా ముగించుకుని నేడు సంక్రాంతి, రేపు కనుము పండుగను కన్నులపండువగా నిర్వహిం చుకోనున్నారు.

మకర సంక్రాంతి..

ఇది మహా పుష్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిది. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి. సం క్రాంతి రోజు పితృదేవతలకు తర్పణం విడు స్తారు. బ్రాహ్మణులకు బియ్యం, బెల్లం గుమ్మడి కాయ దానం చేస్తారు. కొత్త బియ్యం, బెల్లంతో పాయసం చేసి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెడుతారు. మహిళలు, యువతులు పొద్దున్నే లేచి అలుకుజల్లి, రంగురంగుల ముగ్గులు వేస్తా రు. గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ సమ యంలో అలంకరణ ఉన్న ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని హిందువులు నమ్ముతారు. శివుడి నంది స్వరూపాలుగా భావించే గంగిరెద్దులు ఇంటి ఆవరణలో ప్రవేశించడాన్ని శుభ సూచకంగా భావిస్తారు. హరిదాసును విష్ణుస్వరూ పంగా భావించి ధాన్యాన్ని దానంగా సమర్పిస్తారు. సంక్రాంతికి మహిళలు బొమ్మల కొలువులు పెడతారు. ఇంటింటా చిన్నారులు బొమ్మ ల కొలువులు ఏర్పాటు చేస్తారు. సౌభాగ్యవంతులైన మహిళలు సంక్రాంతి నోములు నోచుకు ని ముత్తయిదువులను పిలిచి వాటిని కానుకగా అందజేసి ఆశీర్వాదం తీసుకుంటారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యాన్ని స్వీకరిస్తారు. బెల్లం, నువ్వులు ప్రసాదాలుగా పంచిపెడుతారు. కలకాలం ద్వేషాలు తొలగి సంతోషాలతో కలిసి ఉం డాలని ఆకాంక్షిస్తూ నోములు, వ్రతాలు చేస్తారు.

పశువుల పండుగ కనుము..

సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుము. ‘కనుము’ అంటే పశువు అని అర్థం. కొందరు తెలియక కనుమ అంటారు. ఇది సరికాదు. కనుము పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. పశువులను అలంకరించి గోప్రదక్షిణం చేస్తారు. ఆ రకంగా వాటి రుణం తీర్చుకున్నట్లు భావిస్తారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడుతారు. ఎడ్లబండ్లతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.

సందడిగా ఇండ్లు..

ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగ తో ప్రతి పల్లె సందడిగా మారుతున్నది. శనివా రం నుంచే సెలవులు ప్రకటించడంతో ఎక్కడె క్కడో ఉండే కుటుంబాలన్నీ ఇప్పటికే స్వగ్రామా లకు చేరుకున్నాయి. మంగళవారం భోగితో సం బురాలు మొదలు మొదలయ్యాయి. నిన్నామొ న్నటి దాకా బోసిపోయి కనిపించిన ఇళ్లన్నీ కళకళ లాడుతున్నాయి. దూరం నుంచి వచ్చిన కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు వారి పిల్లలతో సందడిగా కనిపిస్తున్నాయి. మంగళవా రం తెల్లవారుజామున పిల్లలకు తలస్నానం చేయించి రేగుపండ్లు, చెరుకు ముక్కలు, అక్షింతలు కలిపి వారి తలలపై పోశారు. కోడికూతతో నిద్రలేచిన ఆడబిడ్డలు, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో నింపారు. గొబ్బెమ్మలు పెట్టి, పూలు, పండ్లు, నవధాన్యాలతో పూజించారు. ఇప్పటికే చేసుకున్న పిండివంటలతో ఇంటింటా ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. 
 

పతంగుల ఆటలు..

సంక్రాంతి అంటేనే గాలిపటాలకు స్పెషల్‌. పిల్ల లు, పెద్దలు పండుగపూట సంతోషంగా గాలి ప టాలను ఎగరేయడం కనిపిస్తుంది. నాడు పతం గులను ఎక్కువగా ఇళ్లలోనే తయారు చేసుకు న్నా, నేడు షాపుల్లో ప్రత్యేకంగా దొరుకుతు న్నాయి. ఇప్పటికే వీధులు, ఖాళీ ప్రదేశాలతో పాటు బంగ్లాలపై పతంగులు ఎగరేస్తున్నారు.

‘ఆరోగ్య’ క్రాంతి

ప్రతీ పండుగ, ఆచార సంప్రదాయాల వెనుక ఏదో ఒక మానవ ప్రయోజనం ఇమిడి ఉంటుం ది. సంక్రాంతి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ మూడు రోజులు చేసే ప్రతి కార్యక్ర మం వెనుక ఒక్కో విశేషం దాగి ఉంది. సూర్యు డు మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. సూర్యుడు దక్షిణాయణం పూర్తి చేసుకొని ఉత్తరా యణంలో అడుగుపెడతాడు. ఇది శాస్త్రీయాంశం. దీంతో పాటు భోగిమం టలు, గొబ్బెమ్మలు, వాటి చుట్టూ పోసే నవధాన్యాలు, రేగు పండ్లు, మనం తయారు చేసుకొని తినే వంటకాలు, అందులో వినియో గించే పదార్థాలు అన్నీ మన ఆరోగ్యానికి దివ్య ఔషధాల్లా పనిచేసేటివేనంటే ఆశ్చర్యపోక తప్ప దు. చలి కొరికేస్తున్న తరుణంలో ఇలాంటి ఆహా రం తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరగు తుం దని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. logo