సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 15, 2020 , 01:45:24

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలిమెట్‌పల్లి,నమస్తేతెలంగాణ/మెట్‌పల్లిటౌన్‌/కోరుట్లటౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోని పార్టీ కా ర్యాలయాల్లో మున్సిపాలిటీ ఎన్నికల  టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మంగళవారం ఆయన బీఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ తరుఫున చాల మంది ఆశావహులు ఎన్నికల బ రిలో నిలవడంతో టికెట్ల కేటాయింపులో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నయన్నారు. రాజకీయ సమీకరణల అనంతరం గెలుపు గుర్రాలకు అధిష్టానం నిర్ణయంతో టికెట్లు అందించామని చె ప్పారు. టికెట్లు రానివారు నిరాశ పడవద్దని, నా మినెటెడ్‌ పదవుల్లో అర్హులకు అవకాశం కల్పిస్తామని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చే యాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్టు దక్కిన అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే ప్రకటించారు. పలువురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి రూప్‌సింగ్‌తో కలిసి బీపాంలు అందజేశారు. కోరుట్లలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు అ నూప్‌రావు, కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌, ఎంపీ పీ తోట నారాయణ, జిల్లా రైతు సమన్వయ సమి తి సమన్వయకర్త చీటి వెంకటరావు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి, సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షుడు పోతని భూమయ్య పాల్గొన్నారు. 


మెట్‌పల్లిలో..

మెట్‌పల్లి పట్టణంలో 26 వార్డులకు గాను 26 మంది అభ్యర్థులకు  టీఆర్‌ఎస్‌ కార్యాలయలో  బీ ఫాంలను  ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అందజేశా రు. ఇప్పటికే 19వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్య ర్థి రానవేణి సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైన విష యం తెలిసిందే. ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ అ భ్యర్థుల్లో  10వ వార్డు నుంచి  పర్యాటక శాఖ ఎం డీ మనోహర్‌రావు సోదరుడు, మాజీ ఎంపీపీ బో యినపల్లి చంద్రశేఖర్‌రావు, 13వ వార్డు నుంచి  చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తల్లి ముత్తమ్మ ఉన్నారు.  సిట్టింగ్‌ కౌన్సిలర్లు ఎనిమిది మందికి అవకాశం దక్కింది. వీరిలో 2వ వార్డు నుంచి జ క్కం నర్సయ్య, 6వ వార్డు నుంచి బర్ల సాయన్న, 9వ వార్డు  నుంచి మార్గం గంగాధర్‌, 17వ వార్డు  నుంచి ఎనుగందుల వనజ, 18వ వార్డు నుంచి బొర్రోళ్ల గంగారాం, 20వ వార్డు నుంచి ఉజగిరి లక్ష్మి, 24వ వార్డు  నుంచి చెర్లపల్లి ఆనంద్‌గౌడ్‌, 25వ వార్డు  నుంచి మర్రి సహదేవ్‌ ఉన్నారు.


logo