బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 15, 2020 , 01:44:12

ఆఫీసులకు నజరానా

ఆఫీసులకు నజరానా
  • - అధిక మొక్కలు నాటిన కార్యాలయాలకు రూ.50వేలు
  • - గణతంత్ర దినోత్సవం రోజున అందిస్తాం
  • - ఇటిక్యాల సబ్‌స్టేషన్‌లో మొక్కలు నాటిన కలెక్టర్‌ శరత్‌
  • - సొంత ఖర్చులతో మొక్కలు నాటి సంరక్షిస్తున్న లైన్‌మన్‌ మల్లారెడ్డికి అభినందనలు

రాయికల్‌ : అధిక మొక్కలు నాటిన ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రూ.50వేల నజరానా అందజేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. రాయికల్‌ మండలం ఇటిక్యాల సబ్‌ స్టే షన్‌లో లైన్‌మెన్‌ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సబ్‌ స్టేషన్‌ ఆవరణలో విద్యుత్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూసబ్‌స్టేషన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న మల్లారెడ్డి స్వయంగా వివిధ రకాల మొక్కలను కొ నుగోలు చేసి సబ్‌స్టేషన్‌లో నాటడం అభినందనీయమనానరు. మల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ప్రభుత్వ కా ర్యాలయాల్లో ఉద్యోగులు మొక్కలు నాటాలన్నారు.   అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధంగా మొక్కలు నాటాలని, ఏ కార్యాలయంలో అధికంగా మొక్కలు నాటితే జిల్లా తరపున జనవరి 26న రూ.50వేల బహుమతిని అందజేస్తామన్నారు. విద్యుత్‌ శాఖలోని అన్ని సబ్‌స్టేషన్‌లలో ఈ విధంగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని ఉద్యోగులు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ప్రతి పథకం ప్రజలకు చేరువయ్యేలా చర్య లు చేపట్టడం వల్లే రాష్ట్రంలో జిల్లా సుమారు 20పథకాల్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.   కేసీఆర్‌ విద్యుత్‌ శక్తిపై దృష్టి సారించి విద్యుత్‌శక్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేశారన్నారు. 24గంటల పాటు విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. జిల్లా లో విద్యుత్‌ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం 30రోజుల గ్రామ ప్ర ణాళికలో ఏ గ్రామంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేశారన్నారు.

రెండో విడత పల్లె ప్రగతి నిరంతరం కొనసాగుతుందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలోని 272పంచాయతీల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సున్నం వేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో దోమల ఫాగింగ్‌ మిషన్‌, దాతల ద్వారా బాడీ ఫ్రీజర్లను తీసుకోవడం వంటి వినూత్న కార్యక్రమాలను మన జిల్లాలో ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించిన దాతల పేర్లను గ్రామ పంచాయతీల బోర్డులపై రాయించామన్నారు. అనంతరం కలెక్టర్‌, ఆర్డీవో, ఎంపీపీ, సర్పంచ్‌లను విద్యుత్‌ అధికారులు సన్మానించా రు. విద్యుత్‌ అధికారులను కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు స న్మానించారు. అనంతరం ఇటిక్యాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూపొందించిన క్లాత్‌ బ్యాగ్‌లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మొక్కలు కొనుగోలు చేసి సబ్‌స్టేషన్‌లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించిన లైన్‌మెన్‌ మల్లారెడ్డి దంపతులను కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నరేందర్‌, విద్యుత్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌, తాసిల్దార్‌ మహేశ్వర్‌, ఎంపీపీ సంధ్యారాణి, సర్పంచ్‌ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. రా యికల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల నియమ నిబంధనలను తెలియజేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో నరేందర్‌, తాసిల్దార్‌ మ హేశ్వర్‌, అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి రమేశ్‌ ఉన్నారు.

కలెక్టర్‌కు దివ్యాంగుడి  వినతి

 పక్షవాతంతో బాధపడుతున్న తాను పెన్షన్‌ రాక ఇబ్బం దులు పడుతున్నానని, పెన్సన్‌ మంజూరు చేయాలని కోరు తూ కలెక్టర్‌ శరత్‌కు దివ్యాంగుడు మంగళవారం విన్నవిం చాడు. రాయికల్‌ మండలం ఇటిక్యాల సబ్‌స్టేషన్‌లో కలెక్టర్‌ మొక్కలు నాటుతున్న సమయంలో ఇటిక్యాల గ్రామానికి చెందిన తాల్క మల్లయ్యను అతని కుటుంబ సభ్యులు క లెక్టర్‌ వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మల్లయ్య కొంత కాలంగా పక్షవాతానికి గురై మంచానికే పరిమిత మయ్యాడని, పింఛన్‌ రాక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన కుటుంబ సభ్యులు కలెక్టర్‌ కు వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ తాల్క మల్ల య్యను సదరం క్యాంపుకు తీసుకెళ్లి ధ్రువీకరణ పత్రాలు రాగానే పింఛన్‌ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్‌ మహేశ్వర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా పింఛన్‌ మంజూరుకు హామీ ఇచ్చిన కలెక్టర్‌కు మల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.logo