శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 15, 2020 , 01:42:04

మరో ఇద్దరి ఏకగ్రీవం

మరో ఇద్దరి ఏకగ్రీవం
  • -కోరుట్లలో 26వ వార్డు నుంచి అన్నం లావణ్య
  • -29వ వార్డు నుంచి యాటం పద్మ
కోరుట్లటౌన్‌: కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచిన అన్నం లావణ్య, 29వ వార్డుకు చెందిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాటం పద్మ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు సందర్బంగా రెండు వార్డుల్లో కాంగ్రెస్‌, బీజేపీ, స్వతంత్ర అభ్యర్ధులుగా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. 26వ వా ర్డులో ఎంబేరి సుధారాణి (టీఆర్‌ఎస్‌), వాసం అజయ్‌ (కాంగ్రెస్‌), ఎంబేరి నాగభూషణం (టీఆర్‌ఎస్‌), 29వ వార్డులో పురాణం శరణ్య (కాంగ్రెస్‌) తమ నామినేషన్‌ పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఆదివారం 23వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుప్పాల ఉమాదేవి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. కాగా ఎన్నిక ఏకగ్రీవానికి సంబంధించి ఫలితాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అదేశాలతో ప్రకటించనున్నట్లు కమిషనర్‌ ఆయాజ్‌ తెలిపారు. 

టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు

పట్టణంలోని మూడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పార్టీ శ్రేణులు మంగళవారం సంబురాలు జరుపుకొన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. 

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు 

టీఆర్‌ఎస్‌ టికెట్లు దక్కిన 33 మంది అభ్యర్థు లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో టికెట్లు కే టాయించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామన్నా రు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని, బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

స్వీటు తినిపించి.. అభినందనలు

పట్టణంలోని 29వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ త రఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అన్నం లావణ్యను ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో మిఠాయిలు తినిపించి అభినందించారు. కోరుట్ల మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ మ రోమారు గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, నాయకులు ఉన్నారు.  
logo