బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 14, 2020 , 01:45:00

అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయంకోరుట్లటౌన్‌ : అన్ని వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌  ధ్యేయమని రాష్ట్ర మార్క్‌ఫేడ్‌ అధ్యక్షుడు లోక బా పురెడ్డి  పేర్కొన్నారు. పట్టణంలోని 24వ వార్డులో  పద్మపురి కాలనీ, ముత్యాల వాడలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన బాపురెడ్డికి కాలనీవాసులు సాధర స్వాగతం పలికారు. ఈ మేరకు ఇంటింటా తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం, అ భివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ ప్రత్యేక నిధులు రూ. 50 కోట్లు తీసుకువచ్చిన ఎమ్మెల్యే పట్టణంలో అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, మురుగ కాల్వలు, వాటర్‌ట్యాంకులు నిర్మించారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు పింఛన్లు మేమే అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అభివర్ణించారు.

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ పెంచిన పింఛన్లు అందిస్తూ ఆసరాగా నిలుస్తారన్నారు. ఏటా పింఛన్ల కోసం తెలంగాణ  ప్రభు త్వం రూ. 9230 కోట్లు నిధులు వెచ్చిస్తుందనీ, వీటిలో కేంద్రం వాటా కేవలం రూ. 210 కోట్లు మాత్రమేనని చెప్పారు. త్వరలోనే మిషన్‌ భగీరథ శుద్ధ జలాలను నల్లాల ద్వారా ఇంటింటా అందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ మాసంలో పీఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులందరికీ పింఛన్లు అందించడం జరుగుతుందన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ ప్ర ధాన కార్యదర్శి గుడ్ల మనోహర్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సెలర్‌ అభ్యర్థి గుడ్ల లక్ష్మి, అభ్యర్థి కథలాపూర్‌ జడ్పీటీసీ సభ్యుడు నాగం భూమయ్య, జిల్లా రైతు సమన్వయసమితి సమన్వయకర్త చీటి వెంకటరావు, కథలాపూర్‌ ఎంపీపీ జువ్వాజి రేవతి, గణే శ్‌, నాయకులు నాగేశ్వర్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు కల్లెడ శంకర్‌, నాంపల్లి లింబాద్రి, మేడిచల్మెల వేణు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బొడ్డు బాలు, ఎంపీటీసీ ఆంజనేయులు పాల్గొన్నారు.


logo