బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 14, 2020 , 01:44:18

ఎములాడకు పోటెత్తిన భక్తజనం

ఎములాడకు పోటెత్తిన భక్తజనం


వేములవాడ కల్చరల్‌: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి సోమవారం భక్తులు పోటె త్తారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో రాజన్నకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. సమ్మక్క, సారలమ్మల ను దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు తొలుత రాజన్నకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేప థ్యంలో సోమవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకు న్నారు. కోడెమొక్కులు తీర్చుకున్నారు. నాగిరెడ్డిమండపం లోని బాలాత్రిపురసుందరి  అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో భక్తులు నిర్వహించుకునే ఆర్జితసేవలైన అభిషేకపూజలు, అన్నపూజలు, ఆకుల పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో భక్తులు  సోమేశ్వరస్వామివద్ద అభిషేక పూజలు, కళాభవన్‌లో సత్యనారాయణవ్రతాలు, పల్లకీసేవలు, పెద్దసేవ మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను దాదాపు 50  వేల మంది భక్తులు దర్శించుకోగా, రూ. 22లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు వె ల్లడించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ ఈ వో కృష్ణవేణి, అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం,బద్దిపోచమ్మ,నగరేశ్వరాలయాలవద్ద కూడా భక్తుల సందడి నెల కొంది. భక్తు రద్దీ దృష్ట్యా డీఎస్పీ చంద్రకాంత్‌ ఆధ్వర్యం లో సీఐ శ్రీధర్‌ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.logo