శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Jagityal - Jan 14, 2020 , 01:43:38

బల్దియాపై గులాబీ జెండా ఎగరేయాలి

బల్దియాపై గులాబీ జెండా ఎగరేయాలి


జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల బల్దియాపై గులాబీ జెండాను ఎగుర వేయడానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పని చేయాలని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పిలుపునిచ్చారు. జగిత్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం సా యంత్రం 33, 34 వార్డుల్లో దావ వసంత, అభ్యర్థులు బండారి రజని నరేందర్‌, పిట్ట ధర్మరాజులకు మద్దతుగా అన్నపూర్ణ టాకీస్‌ చౌరస్తా నుంచి సంతోష్‌నగర్‌, పోశమ్మవాడ ప్రాంతాల్లో ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌ ఎన్నిక ల్లో గులాబీ జెండాను ఎగురవేయడానికి కంకణబద్దులు కావాలన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ, ప్రతి ఒటరుకు తెలియజేయాలని సూచించారు. రాబోయే వారం రోజులు కలిసి కట్టుగా పని చేసి మున్సిపల్‌లో పోటీ చేస్తున్న ప్రతి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బండారి నరేం దర్‌, లైశెట్టి వెంకటి, కత్రోజు గిరి, దశరథం, మహిళా అధ్యక్షురాలు కచ్చు లత, కొ మ్ము రాధ, జిల్లెల్ల ఉమ, మల్లికార్జున్‌, వొడ్నాల మహేశ్‌, తాడెపు మహేశ్‌, పిట్ట నితిన్‌, రాజేశ్‌, మారం రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


logo