శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Jagityal - Jan 14, 2020 , 01:42:18

గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్‌

గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్‌


ఫెర్టిలైజర్‌సిటీ : ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి అక్రమ  రవాణా, ఇతర నేరాలకు పాల్పడిన కొమురంభీం జిల్లా సిర్పూర్‌ మండ లం నజ్రాల్‌నగర్‌కు చెందిన రమేశ్‌రాయ్‌ అనే 20 ఏళ్ల యు వకుడిపై పీడీ యాక్ట్‌ అమలు చేశారు. ఈ మేర కు రామగుండం సీపీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఆ ఉత్తర్వు కాపీని రామగుండం సీఐ కరుణాకర్‌ రావు, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉమా సాగర్‌ వరంగల్‌ కేంద్ర కారాగారానికి పంపించారు. 2019లో రామగుండం ఎన్టీపీసీ పీఎస్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణాలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా కరీంనగర్‌ జైలుకు తరలించారు. సెంట్రింగ్‌ కూలీగా పని చేస్తున్న రమేశ్‌ రాయ్‌కు వచ్చే సంపాదన సరిపోక తక్కువ సమయంలో సులభంగా సంపాదించేందుకు  సహచరుడు, గతంలో నేర చరిత కలిగిన మహ్మద్‌ అహ్మద్‌ పాషాతో కలిసి గంజాయి అమ్మేవాడు. గతంలో పలుమార్లు హెచ్చరించినా ప్రవర్తన మార్చుకోలేదు. ప్రజా శాంతికి భంగం కలిగించవద్దనే ఉద్దేశంతో పీడీ యాక్ట్‌ అమలు చేయాల్సి వచ్చిందని సీపీ  తెలిపారు. పీడీ యాక్టు నమోదు చేసి ఏసీపీ ఉమేందర్‌, సీఐ కరుణాకర్‌, ఎస్‌ఐ ఉమాసాగర్‌ను అభినందించారు.


logo