శనివారం 28 మార్చి 2020
Jagityal - Jan 13, 2020 , 02:37:17

గజ..గజ..

గజ..గజ..


(జగిత్యాల, నమస్తే తెలంగాణ)
 జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రెండు మూడు రోజుల నుంచీ పెరుగుతున్న చలి తీవ్రత ప్రజలను గజగజా వణికిస్తున్నది. ఉదయం 7దాటినా సూర్యుడు ఆచూకీ కనిపించనంతగా పొగమంచు కమ్ముకుంటున్నది. ఉదయం, సాయం త్రం వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొనడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం 6గంటల లోపే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మంచు విపరీతంగా కురుస్తుండడంతో  చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. ఆదివారం 9డిగ్రీలకు  ఉష్ణోగ్రతలు పడిపోయి ఆందోళన కలిగించాయి. చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. స్వెట్టర్లు ధరించడంతో పటు తలకు మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు పెట్టుకుంటున్నారు. ఉదయం పూట చలిమంటలు కాగుతూ కనిపిస్తున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజులుగా కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రత 10డిగ్రీలు, ఆదివారం 9డిగ్రీలుగా నమోదైంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలే నమోదవుతుండడంతో ఈ సమయాల్లో కూడా చలి తీవ్రత ఉంటున్నది.

పొగమంచు, చలితో ఇబ్బందులు
పొగమంచు, చలి ప్రభావంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో రహదారులు మంచుతో కమ్ముకొని ఉండడంతో లైట్లు వేసుకొని నడుపుతున్నారు. చలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కష్టాలు తప్పడం లేదు. ఆస్తమా, గుండెజబ్బు, బీపీ, షుగర్‌ లాంటి జబ్బులున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులపై చలి ప్రభావం ఉంటుందని, వారికి జ్వరం, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, చలి నుంచి కాపాడుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇస్తున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి
చలికాలంలో జలుబు, దుమ్ము, ధూళి వల్ల దగ్గు, దమ్ము ఎక్కువగా వస్తుంది. చలి ఎక్కువగా ఉన్న సమయలో బయటికి వెళ్లకుంటేనే మేలు. అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. ఊపిరితిత్తుల్లో కఫం చేరి ఇబ్బందులు కలుగుతా యి. ఈ కాలంలో శీతల పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. పిల్లలకు చల్లని నీరు, ఐస్‌క్రీంలు, చల్లబడిన ఆహార పదార్థాలు ఇవ్వకూడదు. కాస్త వేడి చేసిన నీరు, వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవడం మంచిది. గొంతు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పుక్కిళించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో రక్తనాళాల పనితీరు మందగించి గుండెనొప్పి వచ్చే ప్రమాదముంది. ఆస్తమా ఉన్నవారు చలికి దూరంగా ఉండాలి. చలి సమయాల్లో అస్స లు బయటికి వెళ్లకూడదు. ఈ కాలంలో కీళ్ల నొ ప్పులు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. ఇందుకు గాను ఉదయం లేచిన తర్వాత ఇంట్లోనే 30 నిమిషాల పాటు స్వల్ప వ్యాయామం చేయాలి.


logo