బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 13, 2020 , 02:35:13

గ్రామాల అభివృద్ధికి కృషి

గ్రామాల అభివృద్ధికి కృషికోరుట్ల : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మం డలంలోని కల్లూరు గ్రామ పంచాయతీకి  కొను గోలు చేసిన ట్రాక్టర్‌ను సర్పంచ్‌ వనతడుపుల అం జయ్యకు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధ్ది కోసం పల్లె ప్రగతి ప్రణాళికను ప్రవేశపెట్టి గ్రామాలను అభివృద్ది ప థంలో నడి పించేందుకు కృషి చేస్తుందన్నారు. ట్రాక్టర్‌ను గ్రా మాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. పల్లె ప్రగతిలో చేపట్టి పనులను పూర్తి చేసి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ పా ల్గొనాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కల ను సంరక్షించాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపైనా ఉం దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పం చ్‌ సంకె రాకేశ్‌, ఎంపీటీసీ సభ్యురాలు చిట్నేని లత, ఎంపీపీ తోట నారాయణ, జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దారిశెట్టి రాజేశ్‌, మా ర్కెట్‌ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి, చిన్నేని రమేశ్‌, ముత్తయ్య పాల్గొన్నారు.


logo
>>>>>>