బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 13, 2020 , 02:34:39

వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలి

వివేకానందుడి అడుగుజాడల్లో నడవాలిమెట్‌పల్లి రూరల్‌: యువత వివేకానంద బోధనలను ఆచరిస్తూ సన్మార్గంలో నడవాలని మెట్‌ప ల్లి డీఎస్పీ గౌస్‌బాబా పేర్కొన్నారు. మెట్‌పల్లి మం డలం వెల్లుల్లలో 1996-97 పదో తరగతి విద్యార్థుల బృందం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో డీఎస్పీ పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ప్రసంగించారు. చె డు వ్యసనాలకు బానిసలైన వారే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దేశ భవిత యువత చేతిలోనే ఉందని, సత్ప్రవర్తనతోనే మెలగాలని సూచించారు. ఇక్కడ పదో తరగతి పూర్వ విద్యార్థులు, యువకులు, నాయకులున్నారు. అ నంతరం ఎంపీపీ మారు సాయిరెడ్డి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఆత్మనగర్‌, జగ్గసాగర్‌, రామలచ్చక్కపేట, మెట్లచిట్టాపూర్‌, విట్టంపేట, ఆత్మకూర్‌ గ్రామాల్లో వివేకానంద జయంతి వేడుకలను యువకులు ఘ నంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో స ర్పంచులు జరుపుల శ్రీనివాస్‌, బద్దం శేఖర్‌, ఆ కుల రాజరెడ్డి, గజ్జెల నరేశ్‌, చౌట్‌పల్లి లావణ్య, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.


logo