మంగళవారం 31 మార్చి 2020
Jagityal - Jan 13, 2020 , 02:31:59

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


మల్యాల : మల్యాల ప్రభుత్వ బాలుర పాఠశాల 1999-2000బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సాయి ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆత్మీ య సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా పూర్వ విద్యార్థులు రోజంతా ఉల్లాసం గా, ఉత్సాహంగా గడిపారు. అనంతరం పూర్వ వి ద్యార్థులు తమవంతు సహాయంగా పాఠశాలకు మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మిట్టపెల్లి విమల దేవి, సర్పంచ్‌ మిట్టపెల్లి సుదర్శన్‌, ఉప సర్పంచ్‌ పోతరాజు శ్రీనివాస్‌, ఎంఈవో శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల పట్టణంలోని శా రద విద్యాలయం 1998-99బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివా రం బృందావనం రిసార్ట్‌లో నిర్వహించారు.   కొంత డబ్బు సేకరించి సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1998-99బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు గడ్డం ఆనంద రెడ్డి, గాదె ప్రదీప్‌, కట్ట సంతో ష్‌, నస్పూరి శేఖర్‌, గొల్లపల్లి చంద్రమోహన్‌,  అపర్ణ, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>