బుధవారం 01 ఏప్రిల్ 2020
Jagityal - Jan 12, 2020 , 04:58:08

కొండగట్టులో రద్దీ..

కొండగట్టులో రద్దీ..


మల్యాల :  కొండగట్టు అంజన్న క్షేత్రం శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయమే భక్తు లు కోనేటిలో స్నానాలు చేసి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి వారితో పాటు వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు, అనుబంధ ఆలయాలైన బేతాళ స్వామి, మునిగుహలు, కోదండ రామాలయం తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించుకుని మొ క్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు ఆల య ప్రాకార మండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, అష్టోత్తర శథనామావళి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, హారతి, భజన తదిరత ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల రద్దీని బట్టి ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను క్రమబద్ధ్దీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ అంజయ్య, శ్రీనివాస శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌ రావు, సంపత్‌, అర్చకులు, ఆలయ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo
>>>>>>