సోమవారం 30 మార్చి 2020
Jagityal - Jan 12, 2020 , 04:56:03

జిల్లా అధికారులకు డెమొక్రసీ అవార్డులు

జిల్లా అధికారులకు డెమొక్రసీ అవార్డులు

(జగిత్యాల క్రైం/కొడిమ్యాల/ మల్లాపూర్‌/ వెల్గటూర్‌): రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యం లో గతేడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నిక ల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ జిల్లాకు చెందిన ఆరుగురు అధికారులకు గుర్తిం పు లభించింది. హైదరాబాద్‌లోని తారామతి బారాదరి ఆడిటోరియంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదగా ‘స్టేట్‌ డెమొ క్రసీ’ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవా ర్డులు అందుకున్నవారిలో జిల్లా నుంచి డీఆర్డీ వో పీడీ లక్ష్మీనారాయణ, కొడిమ్యాల ఎంపీడీ వో బీ రమేశ్‌, మెట్‌పల్లి ఎంపీడీవో కల్ప న, గొల్లపల్లి ఎంపీడీవో నవీన్‌కుమార్‌, మల్లా పూర్‌ ఎంపీవో భీమేశ్‌రెడ్డి, వెల్గటూర్‌ ఎస్‌ఐ శ్రీ నివాస్‌ ఉన్నారు. భీమేశ్‌రెడ్డికి మల్లాపూర్‌ ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో కోటేశ్వ్‌రావు, సర్పం చులు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతి నిధులు అభినందనలు తెలిపారు.   జిల్లా పోలీస్‌ శాఖ నుంచి అవార్డు అందుకున్న వెల్గ టూర్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ఎస్పీ సింధూ శర్మ, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అభినందించారు.


logo