శనివారం 04 ఏప్రిల్ 2020
Jagityal - Jan 12, 2020 , 04:54:48

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి


తిమ్మాపూర్‌ రూరల్‌: పల్లెల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలోని రామకృష్ణకాలనీ, పొరండ్ల, మల్లాపూర్‌ గ్రామ పంచాయతీలకు వచ్చిన ట్రాక్టర్లను ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచులకు శనివారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించి, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచులకు సూచించారు. ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఖదీర్‌ అహ్మద్‌, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మీసాల అంజయ్య, సతీష్‌, రెడ్డి త్రివేణి, కనుకయ్య, ప్రణీత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo