బుధవారం 08 ఏప్రిల్ 2020
Jagityal - Jan 10, 2020 , 13:12:41

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి

జగిత్యాల క్రైం : మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు పటిష్ట బందబస్తు చేపట్టామనీ, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్‌పెల్లి మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ దక్షిణామూర్తి మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం నామినేషన్లు వేయాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సలహాలు సూచనలు అందచేశారు.


ఆర్‌ఎస్‌ఐకి అభినందన..
పోలీసు శాఖలో విశేషమైన సేవలందించినందుకు గాను పోలీసు ఉత్తమ సేవా పథకాన్ని రాష్ట్ర హోం మంత్రి చేతుల మీదుగా అందుకున్న ఏఆర్‌ఎస్‌ఐ నర్సయ్యను జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి అభినందించారు. విధుల్లో ఉత్తమ సేవలందించడం ద్వారానే పథకాలు వస్తాయనీ, పథకాలు మన జీవితంలో మధుర స్త్రృతులుగా మిగిలిపోతాయన్నారు. తోటి పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ప్రతాప్, ఆర్‌ఐలు వామనమూర్తి, నవీన్, ఆర్‌ఎస్‌ఐ సైదులు పాల్గొన్నారు.

బొట్లవనపర్తిలో ప్రభుత్వ భూముల పరిశీలన
ధర్మారం: ధర్మారం మండలం బొట్లవనపర్తి శివారులోని ప్రభుత్వ భూములను పెద్దపల్లి ఆర్‌డీఓ శంకర్ కుమార్ గురువారం పరిశీలించారు. సాయంపేటకు చెందిన కొందరు బొట్లవనపర్తి శివారు భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో ఆయనకు ఇక్కడకు వచ్చారు. ధర్మారం తాసిల్దార్ పిం.సంపత్‌తో కలిసి ఏ ఏ సర్వే నెంబర్లలో భూమి ఆక్రమణకు గురైన భూములను పరిశీలించారు. పహానీ రికార్డులను ఆయన పరిశీలించి భూముల వివరాలను తెలుసుకున్నారు. బొట్లవనపర్తి శివారు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను మొత్తం సర్వే చేసి తనకు నివేదిక పంపించాలని తాసిల్దార్‌ను ఆదేశించారు. ఆక్రమణ దారుల వివరాలు నివేదించాలని సూచించారు. అనంతరం ఆయన నంది మేడారంలోని నంది రిజర్వాయర్ నుంచి ధర్మారం శివారులోని డి83/బి కాల్వకు అనుసంధానంగా తవ్వే లింక్ కాలువ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరా తీశారు. లింక్ కాలువలో కోల్పోనున్న రైతుల భూముల జాబితా వివరాలను రెండు రోజుల్లో నివేదిక పంపాలని తాసిల్దార్‌కు సూచించారు. అనంతరం ఆర్డీఓ ధర్మారంలోని రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆర్‌డీఓకు పుష్పగుచ్ఛం అందజేసి తాసిల్దార్ శుభాకాంక్షలు తెలిపారు.


logo