గురువారం 02 ఏప్రిల్ 2020
Jagityal - Jan 10, 2020 , 13:12:16

బీ ఫాంలు వచ్చేశాయ్..

బీ ఫాంలు వచ్చేశాయ్..

జగిత్యాల/ధర్మపురి/మెట్‌పల్లి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు ఇచ్చేందుకు ము ఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీ ఫాంలను మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు అందజేశారు. జిల్లా నుంచి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, డాక్టర్ సంజయ్‌కుమార్ హాజరై సీఎం నుంచి బీ ఫాంలు తీసుకున్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో నేడు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వాటిని అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చినట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు. ఇవి పట్టణాల్లో జరిగే సున్నితమైన ఎన్నికలని, వీటిల్లో బంధుత్వాలు, స్నేహ సంబంధాలు అన్నీ ముడిపడి ఉంటాయని చాలా సున్నితంగా డీల్ చేయాలని సూచించినట్లు చెప్పా రు. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేసేందుకు సమష్టిగా కష్టపడాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.


logo