e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home కరీంనగర్ బీజేపీ కుట్రలను బయటపెడతాం

బీజేపీ కుట్రలను బయటపెడతాం

బీజేపీ కుట్రలను బయటపెడతాం

ఈ ఎన్నికల్లో ఈటలను పావుగా వాడుకుంటున్నది
తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఢిల్లీకి తాకట్టుపెట్టిండు
అరాచకమే ఆయన ఎజెండా
తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ తుంగ బాలు, అధ్యక్షుడు తొట్ల స్వామియాదవ్‌
హుజూరాబాద్‌కు చేరుకున్న బస్సుయాత్ర
వీణవంకలో ఇంటింటా ప్రచారం

హుజూరాబాద్‌టౌన్‌/ వీణవంక జూలై 18 : మతతత్వ బీజేపీలో కమ్యూనిస్టు భావాలు ఉన్న ఈటల రాజేందర్‌ చేరి ఢిల్లీకి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తాకట్టుపెట్టాడని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ తుంగ బాలు, అధ్యక్షుడు తొట్ల స్వామియాదవ్‌, అధికార ప్రతినిధి కడారి స్వామి మండిపడ్డారు. ఈటలను హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పావుగా వాడుకునేందుకే బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, దీనిని బట్టబయలు చేయడానికే తెలంగాణ విద్యార్థి జేఏసీ బస్సుయాత్ర చేపట్టిందని చెప్పారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేయడానికి ఫీడర్‌ యూనివర్సిటీల(హైదరాబాద్‌) నుంచి చేపట్టిన బస్సుయాత్ర ఆదివారం సాయంత్రం హుజూరాబాద్‌కు చేరుకోగా, ఇక్కడి టీఆర్‌ఎస్‌వీ నాయకులు, ప్రజాప్రతినిధులు డప్పు కళాకారుల నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు.

ముందుగా స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేయడంతో పాటు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కరపత్రం ఆవిష్కరించారు. వీణవంక మండలకేంద్రానికి వెళ్లి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేశాడు, ప్రజల ప్రయోజనాల కోసమా? లేక ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమా? అన్నది వివరించడంతో పాటు సిద్ధాంత పరంగా చెప్పకుండా బీజేపీలో చేరి, ఆ నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని ఒకటి కావడం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటిది అన్నది నియోజకవర్గ ప్రజలకు వివరిస్తాం’ అని తెలిపారు. ‘అసైన్డ్‌ భూములను కబ్జా చేసిన ఆరోపణలు ఎదురొంటున్న ఈటల రాజేందర్‌ను బీజేపీ ఏమి ఆశించి చేర్చుకున్నది, ఈటలను పావుగా వాడుకొని పన్నుతున్న పన్నాగమేంటి?, నిజా నిజాలు నిగ్గు తేల్చుతాం’ అని చెప్పారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని ఖతం చేసేందుకు ఢిల్లీ పార్టీ బీజేపీ కుట్రలు చేస్తున్నదని, దీనిని బట్టబయలు చేయడానికి విద్యార్థి జేఏసీ గ్రామగ్రామాన తిరుగుతాం’ అని స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీకి ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలన్నారు.

- Advertisement -

అనేక పదవులు ఇచ్చి ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌ అశయాలను, టీఆర్‌ఎస్‌ ఎజెండాను, నియోజకవర్గ అభివృద్ధిని మరిచి ఈటల రాజేందర్‌ అరాచకమే తన ఎజెండాగా చేసుకున్నాడని మండిపడ్డారు. 2004లో కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎంతో మంది సీనియర్‌లు ఉన్నప్పటికీ ఈటల రాజేందర్‌కు అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరాడని, గతంలో ఆయన ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పని చేశామని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేయడానికి వచ్చామని, ప్రజలు నిజాలను గ్రహించాలని కోరారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు అమాయకులు కారని, అన్నీ గమనిస్తున్నారని, ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన ఈటల రాజేందర్‌ను ఓడించడమే ఎజెండాగా యువకులు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీకి తెలంగాణ మీద ఎప్పుడూ వివక్షనే ఉంటుందని, ఆంధ్రా పార్టీలకు ఇక్కడి ప్రజల మీద ఎన్నడూ తీరని కక్ష ఉంటుందని, అస్తిత్వ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒకటే నిజమైన రక్ష అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ను హుజురాబాద్‌లో భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ అస్తిత్వాన్ని, హకులను, అభివృద్ధిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 25 మందితో ఒక బృందం చొప్పున గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేస్తామన్నారు.

ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌వీ జిల్లా మాజీ ఇన్‌చార్జి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మొలుగు పూర్ణచందర్‌, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు ఆవాల హరిబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆలేటి శ్రీరాం, పట్టణ అధ్యక్షుడు విడపు అనురాగ్‌, నియోజకవర్గ నాయకుడు అనిల్‌యాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, జేఏసీ నాయకులు కోతి విజయ్‌, టైగర్‌ రఘురామ్‌, కరుణాకర్‌రెడ్డి, చటారి దశరథ్‌, జంగం అవినాష్‌, సూరంపల్లి పరశురాం, గదరాజు చందు, జేడీ అనిల్‌, శివ, వెంకట్‌, నవీన్‌గౌడ్‌, కృష్ణ, శిశుపాల్‌, మబ్బు కరుణాకర్‌, వేల్పుకొండ వెంకటేశ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, నాగారం ప్రశాంత్‌, గెల్లు రాకేశ్‌, భరత్‌, రవికిరణ్‌, శ్రావణ్‌కుమార్‌, రవితేజ, ఉపేందర్‌, హర్ష, సాయి, కోరె రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీ కుట్రలను బయటపెడతాం
బీజేపీ కుట్రలను బయటపెడతాం
బీజేపీ కుట్రలను బయటపెడతాం

ట్రెండింగ్‌

Advertisement