e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జగిత్యాల నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి

నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి

నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి

కలెక్టర్‌ కే శశాంక
సరుకుల రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి
టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష

కరీంనగర్‌, మే 17 (నమస్తే తెలంగాణ);లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కే శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాల యం నుంచి లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ, రవాణాలో సమస్యలపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హోల్‌సేల్‌ మారెట్‌లో వంటనూనెలు, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెంచకుండా అధికారులు తనిఖీలు చేస్తూ పర్యవేక్షించాలని నిర్దేశించారు. ప్రజలకు మారెట్లలో కూరగాయల సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిత్యావసర సరుకుల రవాణా వాహనాలను లాక్‌డౌన్‌లో ఎకడా ఆపకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. స మస్యలు ఉంటే వెంటనే డిప్యూటీ రవాణా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిషరించాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వానకాలం సీజన్‌ సమీపిస్తున్నందునా అవసరమైన ఎరువులు, విత్తనా లు సరఫరా వాహనాలకు రవాణా సమస్యలు లేకుండా చూడాలన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలి..
కొత్తగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యం లో అధికారులు అప్రమత్తంగా ఉండా లని, చికిత్సకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో అంబులెన్స్‌ రేట్లు నిర్ణయించామని, ఆ రేట్లు అమలు జరిగేలా చూడాలని తెలిపారు. లాక్‌ డౌన్‌ సమయంలో వలస కూలీలు జిల్లా నుంచి వెళ్లిపోకుండా తగిన చర్యలు చేపట్టాలని లేబర్‌ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలగకుండా పనులు సజావుగా సాగేలా కొనసాగించాలని సూచించా రు. జిల్లాకు పాలు, గుడ్లు, మాంసం వాహనాల రవా ణా సరిగా జరిగేలా చూడాలని జిల్లా పశు వైద్యాధికారిని ఆదేశించారు. చికెన్‌, మటన్‌, షాప్‌ లు, కూరగాయల మా రెట్‌లో ప్రజలు భౌతిక దూ రం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు శ్రీనివాస్‌, జిల్లా మారెటింగ్‌ అధికారి పద్మావతి, సివిల్‌ సప్లయ్‌ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, డిప్యూ టీ రవాణా కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కిరణ్‌కుమార్‌, లేబర్‌ డిప్యూటీ కమిషనర్‌ రమేశ్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌, కరీంనగర్‌, హుజూరాబాద్‌ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి

ట్రెండింగ్‌

Advertisement