e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home జగిత్యాల ఎందుకీ నాటకాలు?

ఎందుకీ నాటకాలు?

ఎందుకీ నాటకాలు?

సీఎం పదవి కోసమేనా..
ఈటలది అత్యాశ, దురాశ
కేసీఆర్‌ పాలనలోనే ఆర్యవైశ్యులకు ప్రాధాన్యం
పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌

హుజూరాబాద్‌/ హుజూరాబాద్‌టౌన్‌, జూన్‌15: రాజకీయంగా అన్ని రకాల పదవులు అనుభవించింది ఒక్క ఈటల రాజేందర్‌ మాత్రమేనని, ఇప్పుడు ఆ సీఎం పదవి కోసమే రాజకీయ నాటకాలు ఆడుతున్నాడని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ విమర్శించారు. మంగళవారం ఆయన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలో సిటీ సెంటర్‌హాల్‌లో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై, మాట్లాడారు. మాజీ మంత్రి ఈటలకు రాజకీయంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఇంకా అత్యాశ, దురాశకు పోయారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ పాలనలోనే ఆర్యవైశ్య కులస్థులకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు. ఆర్యవైశ్యులకు త్వరలో కార్పొరేషన్‌ ఏర్పాటు కాబోతుందని, ఎంతో చేయూత లభిస్తుందని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో తగిన ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల్లో ఆర్యవైశ్య భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రలోని 33జిల్లాల ఆర్యవైశ్య అధ్యక్షులు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ వై సునీల్‌రావు, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్‌, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాటిపెల్లి రాజన్న, మార్కెట్‌ డైరెక్టర్‌ పూల్లూరి శ్రీకాంత్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడు గందె సాయిచరణ్‌, కిరాణవర్థక సం ఘం అధ్యక్ష, కార్యదర్శులు చందాగాంధీ, శీల రాజేంద్రప్రసాద్‌, రైస్‌మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు శివనాధుని వేణు, శీల శ్రీనివాస్‌, క్యాస ఉపేందర్‌, శివనాధుల శ్రీనివాస్‌, అనిల్‌ పాల్గొన్నారు.
రైతుల సంతోషమే సీఎం లక్ష్యం
రైతుల మోముల్లో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని, అందుకే అడగకుండానే కష్టకాలంలో నూ పెట్టుబడి సాయం చేస్తూ చరిత్రలో నిలిచిపోయారని కోలేటి దామోదర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అంతకు ముందు అం బేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా కోలేటి మాట్లాడుతూ, రైతు బంధు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతతో గ్రామగ్రామాన రైతుల పాలాభిషేకం చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలో రెండెకరాలలోపు భూమి ఉన్నవారు 42 లక్షల మంది ఉంటే, 5 ఎకరాలలోపు భూమి ఉన్నవారు 11లక్షల మంది రైతులు, మొత్తం 95శాతం చిన్న, సన్నకారు రైతులే లబ్ధి పొందుతున్నారని చెప్పారు.

- Advertisement -

రైతు బంధు వల్ల భూస్వాములే లబ్ధిపొందుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని ఇకనైనా గ్రహిస్తే మంచిదన్నారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, మండల, పట్టణశాఖ అధ్యక్షులు సంగెం ఐలయ్య, కొలిపాక శ్రీనివాస్‌, కౌన్సిలర్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, కౌన్సిలర్లు మారపల్లి సుశీల, తాళ్లపల్లి శ్రీనివాస్‌, అపరాజ ముత్యంరాజు, తొగరు సదానందం, తోట రాజేంద్రప్రసాద్‌, సింగిల్‌విండో చైర్మన్‌ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, మక్కపెల్లి కుమార్‌, బర్వాత్‌ యాదగిరినాయక్‌, ముక్క రమేశ్‌, గోస్కుల రాజు, నాయకులు మొలుగు పూర్ణచందర్‌, ప్రభాకర్‌, బీఎస్‌ ఇమ్రాన్‌, కొడపాక శ్రీనివాస్‌, ప్రతాప కృష్ణ, చొల్లేటి శ్యామ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎందుకీ నాటకాలు?
ఎందుకీ నాటకాలు?
ఎందుకీ నాటకాలు?

ట్రెండింగ్‌

Advertisement