e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జగిత్యాల పథకాలతో పేదలకు భరోసా

పథకాలతో పేదలకు భరోసా

పథకాలతో పేదలకు భరోసా

పెద్దపల్లి జిల్లాలో బెడ్స్‌ కొరత లేదు
సరిపడా మందులున్నాయి lప్రభుత్వం అప్రమత్తంగా ఉంది
జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

పెద్దపల్లి, మే 14(నమస్తే తెలంగాణ): కొవిడ్‌ చికిత్స కోసం పెద్దపల్లి జిల్లాలో బెడ్స్‌ కొరత లేదని, మందులు అందుబాటులో ఉన్నాయని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. కరోనాపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, వైరస్‌ను ఎదుర్కొనేందుకు చికిత్స కన్నా ధైర్యమే మందు అని చెప్పారు. శుక్రవారం ఆయన జడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మందులు, పడకల కొరత ఏ మాత్రం లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 100 ఆక్సిజన్‌ బెడ్లు, మరో 100 వెంటిలేటర్‌ బెడ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, పెద్దపల్లి జిల్లా దవాఖానలో 50 ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనాను పూర్తిగా నియంత్రించడంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను విధించారని, ప్రజలు సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతరం నేరుగా సమీక్షిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ వల్లే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో నంబర్‌-1గా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో రికవరీ రేటు ఎక్కువగా ఉందని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని భరోసా ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 80శాతానికి పైగా ఫీవర్‌ సర్వే పూర్తయిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా సేవలందిస్తున్న వైద్య, పోలీసు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, మీడియా సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

బడుగుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే కల్యాణలక్ష్మి
మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
మానకొండూర్‌ రూరల్‌, మే 14: నిరుపేదల బతుకులకు భరోసానిచ్చేందుకే కేసీఆర్‌ సర్కారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఉద్ఘాటించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మానకొండూర్‌ మండలంలో శుక్రవారం పలు గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా గ్రామా లకు వెళ్లి అందజేశారు. మండలంలోని మానకొండూర్‌ గ్రామంతో పాటు అన్నారం, ఊటూర్‌, పచ్చునూర్‌, మద్దికుంట, కొండపల్కల, గంగిపల్లిల్లోని మొత్తం 70 కల్యాణలక్ష్మి , 2 షాదీ ముబారక్‌ చెక్కులు మొత్తం 72 మందికి గాను రూ. 72, 08,352 రూపాయలను అందజేశారు. ఈ చెక్కులను కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వారి గ్రామాల్లోకి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు.

ప్రతి ఒక్క ఆడబిడ్డకు భరోసా నివ్వాలని ఈ పథకం తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. చెకు ్కలను చూసి మురిసిపోతూ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టకాలం లోనూ ప్రభు త్వం పథకాలను కొనసాగిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్‌ గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు నల్ల వంశీధర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ గోపు మధుసూదన్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నల్ల గోవిందరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పంజాల శ్రీనివాస్‌, సర్పంచులు బొట్ల కిషన్‌, సుదర్శన్‌, వసంత, కొత్తూరి పద్మ, మాశం శాలీని, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ తిరుపతి గౌడ్‌, నాయకులు కడారి ప్రభాకర్‌, బొల్లం శ్రీనివాస్‌, కొత్తూరి జగన్‌ గౌడ్‌, తిరుపతి రెడ్డి, అడప శ్రీనివాస్‌, నరేందర్‌, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం..
మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన గ్రామ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు బండి చంద్రయ్య, బండి స్వరూప, తోట వెంకటయ్య, బొంగోని రాజేశ్వరీ ఇటీవల మృతి చెందారు. మృతుల కుటుంబాలను శుక్రవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలంగాణాలో కరోన మహమ్మారి రోజు రోజుకూ తీవ్ర మ వుతుందని, కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించాలని సూచించారు. ఇంకా అవగాహన చేసుకొని మనుగడ సాగించాలని ఉద్బోధించారు. కరోన బారినపడి మృతి చెందిన కుటుంబాలకు అందగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి మనమంతా రుణపడి ఉంటామని అన్నారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూ చించారు. గ్రామానికి చెందిన బండి చంద్రయ్య మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పథకాలతో పేదలకు భరోసా

ట్రెండింగ్‌

Advertisement