e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జగిత్యాల ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..

ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..

ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..

పేదలపై ప్రేమ ఉంటే భూములు తిరిగి పంచాలి
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రైతు సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం
ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‌

ఇల్లందకుంట, జూన్‌ 13: మాజీ మంత్రి ఈటలకు నిజంగా బడుగు బలహీన వర్గాలపై ప్రేమ ఉంటే అసైన్డ్‌ భూములను తిరిగి పంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి వెళ్తున్నాడని విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో 18 ఏండ్లుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీపై ఈటల రాజేందర్‌ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 57 ఏండ్లు ఉండి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. 4.50లక్షల మందికి మందికి రేషన్‌ కార్డులను వారంలో అందజేస్తామని, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను త్వరలో ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు మంజారు చేస్తామని వివరించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమమే కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు.

రాష్ట్ర సర్కారు పల్లె ప్రగతి కింద గ్రామాలకు ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నదని, అనేక పథకాలతో ప్రజలు, రైతులకు అండగా నిలుస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచడంతో పేదలపై పెను భారం పడుతున్నదని, నల్లా చట్టాలను తెచ్చి రైతుల నడ్డివిరుస్తున్నదని మండిపడ్డారు. అనంతరం సిరిసేడు గ్రామానికి చెందిన 50 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, ఎమ్మెల్సీ పల్లా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే సిరిసేడుకు చెందిన ఆటో యూనియన్‌ సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపగా, వారిని పార్టీలోని స్వాగతం పలికారు. అంతకుముందు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల నుంచి పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణ, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, మల్యాల పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ఉడత వీరస్వామి, సర్పంచులు మట్ట రజిత, దిలీప్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, చిన్నరాయు డు, రమ, విజయ, మాజీ ఎంపీటీసీలు గీత, కుమారస్వామి, మాజీ సర్పంచ్‌ బుర్ర రమేశ్‌, ఆర్‌బీఎస్‌ గ్రామ కోఆర్డినేటర్‌ ముస్తాఫా, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ ఇన్‌చార్జి అలేటి శ్రీరాం, నాయకులు గణపతి, వీరన్న, కుమార్‌, తిరుపతిరెడ్డి, రాంస్వరణ్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..
ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..
ఆస్తులు కాపాడుకునేందుకే బీజేపీలోకి..

ట్రెండింగ్‌

Advertisement