e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home కరీంనగర్ స్మార్ట్‌' పనులను పూర్తి చేయాలి

స్మార్ట్‌’ పనులను పూర్తి చేయాలి

స్మార్ట్‌' పనులను పూర్తి చేయాలి

కరీంనగర్‌ కలెక్టర్‌ కే శశాంక
పనుల పురోగతిపై మేయర్‌ సునీల్‌రావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం

కార్పొరేషన్‌,జూలై12: కరీంనగర్‌ బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన స్మార్ట్‌ సిటీ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ క్యాం పు కార్యాలయంలో స్మార్ట్‌సిటీ పనుల పురోగతిపై నగర మేయర్‌ సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతితో కలిసి మున్సిపల్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మలాపూర్‌, కిసాన్‌నగర్‌, రాంచంద్రాపూర్‌, కట్టారాంపూర్‌, షాలీమార్‌ ఫం క్షన్‌హాల్‌ వద్ద కొనసాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు పనుల్లో బేస్‌వర్‌, ట్రెన్‌వర్‌ పెండింగ్‌ లేకుండా త్వరగా పూర్తి చేయాలని, రోడ్ల మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించాలని సూచించారు. వేంకటేశ్వరస్వామి ఆలయం, రాజీవ్‌చౌక్‌ వద్ద అభివృద్ధి పనులను ప్రారంభించాలన్నారు. స్మార్ట్‌ సిటీ పనులను తొందరగా పూర్తిచేయాలన్నారు. స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా డంప్‌యార్డ్‌ పనులను, చెత్త సేకరణకు ఆటో, ట్రాక్టర్‌కు జీపీఎస్‌ సిస్టం ఉంటుందన్నారు. స్మార్ట్‌ సిటీ పనుల్లో భా గంగా చేపట్టిన రోడ్ల పనుల వివరాలను అందించాలని, సుందరీకరణ పనులను సైతం గడువులో గా పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ కృష్ణారావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్మార్ట్‌' పనులను పూర్తి చేయాలి
స్మార్ట్‌' పనులను పూర్తి చేయాలి
స్మార్ట్‌' పనులను పూర్తి చేయాలి

ట్రెండింగ్‌

Advertisement