ఊరూరా వేగంగా ఫివర్ సర్వే
లక్షణాలున్నవారికి ఐసోలేషన్ కిట్ల అందజేత
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
గంగాధర, మే 7: సర్కారు ఆదేశాల మేరకు కరోనా కట్టడికి అధికార యంత్రాగం కదిలింది.. వైద్య ఆరోగ్య, పంచాయతీ సిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు ఊరూరా ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యపరిస్థితులను అడిగితెలుసుకొని వైరస్ లక్షణాలు ఉన్నవారికి ఐసొలేషన్ కిట్లను అందజేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ముందుకుసాగుతున్నారు.
మండలంలోని కురిక్యాల, గట్టుభూత్కూర్, మల్లాపూర్, కాచిరెడ్డిపల్లి గ్రామాల్లో గురువారం ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ సర్వే నిర్వహించారు. జ్వరం, దగ్గు, జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని, హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. గ్రామస్తులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, బయటికి వచ్చే క్రమంలో మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. ఇక్కడ సర్పంచులు మేచినేని నవీన్‌రావు, కంకణాల విజేందర్‌రెడ్డి, ఆకుల శంకరయ్య, జోగు లక్ష్మీరాజం ఉన్నారు.
రామడుగు, మే7: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, వాటి అనుబంధ గ్రామాల్లో రెండోరోజూ శుక్రవారం ఇంటింటికీ జ్వర సర్వే కొనసాగింది. ఇందులో భాగంగా శ్రీరాములపల్లిలో ఆ రోగ్య సిబ్బంది చేపట్టిన సర్వేను ఎంపీడీవో ఎన్నా ర్ మల్హోత్రా పాల్గొని పరిశీలించారు. కాగా, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబాల్లో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారా, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడే వారి వివరాలను పొందుపరుచుకున్నారు. కాగా సర్వేలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, కార్యదర్శులు, కారోబార్లు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్: మే7: కరీంనగర్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ సర్వే చేశారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు వీవోలు, సీవోలు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మూడు టీంలుగా విభజించారు. వీరు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించారు. జ్వరం. బలుబు. తలనొప్పితో బాధపడుతున్న పలువురికి ఐసోలేషన్ కిట్లు అందించారు. ఇప్పటి వరకు చెర్లభూత్కూర్‌లో 750 ఇండ్లకు రెండు రోజుల్లో పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో గో పాల్పూర్‌లో సర్పంచ్ ఊరడి మంజులా మల్లారెడ్డి, చెర్లభూత్కూర్‌లో పద్మ, భాగ్యలక్ష్మి, ఆశ కార్యకర్తలు జమున, సరిత, రాజమణి, ఏఎన్ఎం వసంత, వీవోలు అనిత లావణ్య, సీఏతోపాటు కార్యదర్శి కిరణ్, దుర్శేడ్‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుస్మిత, ఆశ కార్యకర్తలు లక్ష్మి, అనిత, సరోజన, అంగన్వాడీ టిచర్లు పద్మ, రాజేశ్వరి, కా రోబార్ మురళి, నగునూర్‌లో కారోబార్ ఫారూక్, ఆశ, అంగన్వాడీ టీచర్లు, జూబ్లీనగర్‌లో ఆశ , అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.