e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home కరీంనగర్ పేదల సంజీవని సీఎంఆర్‌ఎఫ్‌

పేదల సంజీవని సీఎంఆర్‌ఎఫ్‌

  • ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌
  • స్వయంగా కరోనా వ్యాక్సిన్‌ వేసిన ఎమ్మెల్యే

రాయికల్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 17 : పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ సంజీవనిలా పని చేస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. రాయికల్‌ పట్టణంలోని పద్మశాలీ సేవా సంఘం కల్యాణ మండపంలో 18 మంది లబ్ధిదారులకు గాను మంజూరైన రూ. 5.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ప్రారంభించి కౌన్సిలర్లకు, ఇతరులకు ఎమ్మెల్యే స్వయంగా వ్యాక్సిన్‌ వేశారు. కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్‌ కవచంలా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా టీకా తీసుకోవాలని సూచించారు. గతంలో జిల్లా ఆసుపత్రిలో 15 మంది వైద్యులు ఉంటే ఇప్పుడు 50 మంది వైద్యులను నియమించి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ లావుడ్య సంధ్యరాని, మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్‌పర్సన్‌ గండ్ర రమాదేవి, ఏఎంసీ చైర్మన్‌ గన్నె రాజరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొల్లూరి వేణు, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్‌ రెడ్డి, రాయికల్‌ మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కోల శ్రీనివాస్‌, నాయకులు హూస్సేన్‌, ముఖీద్‌, తలారి రాజేశ్‌, పెండెల వనిత, మేర వెంకటేశ్వర్లు, కొత్తపెల్లి ప్రసాద్‌, జక్కుల చంద్రశేఖర్‌ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement