శనివారం 28 నవంబర్ 2020
International - Oct 29, 2020 , 14:07:51

జైడస్‌ కాడిలా ‘లినాగ్లిప్టిన్‌’ మందులకు ఎఫ్‌డీఏ అనుమతి

జైడస్‌ కాడిలా ‘లినాగ్లిప్టిన్‌’ మందులకు ఎఫ్‌డీఏ అనుమతి

న్యూఢిల్లీ : టైప్-2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే లినాగ్లిప్టిన్ టాబ్లెట్లను మార్కెట్ చేయడానికి యూఎస్‌ హెల్త్ రెగ్యులేటర్ నుంచి తాత్కాలిక అనుమతి లభించిందని జైడస్ కాడిలా సంస్థ గురువారం తెలిపింది. ఐదు మిల్లీ గ్రాముల లినాగ్లిప్టిన్‌ మాత్రలను మార్కెట్‌ చేసేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి జైడస్ కాడిలాకు అనుమతి లభించిందని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. జైడస్‌ కాడిలా హెల్త్‌కేర్‌ గ్రూప్‌లో భాగం. అహ్మదాబాద్‌లోని సెజ్‌ వద్దనున ఫార్ములేషన్‌ తయారీ కేంద్రంలో కొత్తగా ఆమోదించిన మందును తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం 310 ఔషదాలకు అనుమతి పొందింది. 2003-04 ఆర్థిక సంవత్సరంలో ఫైలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 390కిపైగా కొత్త ఔషధాల అనుమతి కోసం దరఖాస్తు చేసింది. టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్న పెద్దవారిలో గ్లైసెమిక్‌ను మెరుగుపరిచేందుకు నినాగ్లిప్టిన్‌ మాత్రలను ఉపయోగిస్తారు. కాడిలా హెల్త్‌కేర్ షేర్లు బీఎస్‌ఈలో 0.88 శాతం తగ్గి రూ. 414.75 వద్ద ట్రేడవుతున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.