మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 14:49:05

చిలుక పలుకులు తెలుసు.. చిలుక తిట్లు ఎప్పుడైనా విన్నారా?

చిలుక పలుకులు తెలుసు.. చిలుక తిట్లు ఎప్పుడైనా విన్నారా?

లండన్‌: చిలుక పలుకులు భలే ముద్దుగా ఉంటాయి. అందుకే మాట్లాడే చిలుకలను చాలామంది ఇష్టపడుతారు. అచ్చం చిన్నపిల్లల్లా చాలా ముద్దుముద్దుగా పదాలను పలుకుతుంటే మురిసిపోతుంటారు. మరి అవే చిలుకలు బూతు పదాలను ప్రయోగిస్తాయని తెలుసా? లండన్‌లోని ఓ జంతు ప్రదర్శనశాలలో అదే జరిగింది. జంతువులను చూసేందుకు వచ్చిన సందర్శకులను చిలుకలు మూకుమ్మడిగా తిట్టడం ప్రారంభించాయి. దీంతో వాటిని డిస్‌ప్లే నుంచి తొలిగించారు. 

ఈ సరదా సంఘటన యూకేలోని లింకన్‌షైర్‌ వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌లో జరిగింది. ఇక్కడికి ఆగస్టు 15న ఐదు ఆఫ్రికన్ చిలుకలను తీసుకువచ్చారు. వాటన్నింటినీ ఒక గదిలో కలిపి ఉంచారు. అయితే, అవి ఎలాగో తెలియదుకానీ కొన్ని బూతుపదాలు నేర్చుకున్నాయి. మొదట జూకీపర్లు, ఇతర సిబ్బందిని తిట్టడం ప్రారంభించాయి. అయితే, వారు సరదాగా తీసుకున్నారు. వాటిని డిస్‌ప్లేలో ఉంచారు. కాగా, చిలుకలు వచ్చిన సందర్శకులపై తిట్ల దండకం అందుకున్నాయి. వారు ఫిర్యాదు చేయడంతో జూ అధికారులు చిలుకలపై చర్య తీసుకున్నారు. వాటిని డిస్‌ప్లేలో ఉంచిన 20 నిమిషాలలోనే అక్కడినుంచి తరలించారు. వాటన్నింటినీ కొన్నిరోజులు కలిపిఉంచామని, దీంతో అవన్నీ ఒకదానినుంచి బూతుపదాలు పలుకడం నేర్చుకున్నాయని వైల్డ్ లైఫ్ పార్క్ సీఈవో స్టీవ్ నికోలస్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo