శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 16:55:29

ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల

ఆకట్టుకుంటున్న అరుదైన తెల్లని కంగారు పిల్ల

వాషింగ్టన్‌: అమెరికాలోని న్యూయార్క్‌ జూలో అరుదైన తెల్లని కంగారు పిల్ల సందర్శకులను ఆకట్టుకుంటున్నది. యానిమల్ అడ్వెంచర్ పార్క్‌లో జోయ్‌ అనే పిల్ల కంగారుకు డాడీ కంగారు బూమర్, మమ్మీ కంగారు రోసీ జన్మనిచ్చాయి. కాగా సాధారణంగా కంగారుల శరీరం ఎరువు, గోధుమ రంగులో ఉంటుందని అయితే జోయ్‌ మాత్రం అరుదైన తెలుపు రంగులో ఉన్నదని జూ సిబ్బంది తెలిపారు. అసాధారణ రంగులో ఉన్న జోయ్‌ కంగారు పిల్ల గురించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ పిల్ల కంగారు ఫొటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యాయి. ఈ అరుదైన తెల్ల కంగారు పిల్లపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo