గురువారం 25 ఫిబ్రవరి 2021
International - Jan 23, 2021 , 10:02:47

వుహాన్‌ మేయర్‌ షియాన్‌వాంగ్‌ రాజీనామా

వుహాన్‌ మేయర్‌ షియాన్‌వాంగ్‌ రాజీనామా

బీజింగ్‌: కరోనా పుట్టినిల్లు వుహాన్‌ మేయర్‌ జౌ షియాన్‌వాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. మహమ్మారి చైనా నుంచి ప్రపంచానికంతటికి వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించడమే ఆయన పదవికి ముప్పు తెచ్చింది. కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన వుహాన్‌లో 2020, జనవరి 22న షియాన్‌వాంగ్‌ లాక్‌డౌన్ విధించారు. తాము వుహాన్‌లో లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందే దాదాపు 50 లక్షల మంది స్థానికులు నగరం దాటి వెళ్లిపోయారు. వారంతా చైనాలోని వివిధ ప్రాంతాలు సహా పలు దేశాలకు వెళ్లారు. వారి ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉందని.. లాక్‌డౌన్‌ సందర్భంగా హెచ్చరించారు. అయితే ఈ ప్రకటనతో చైనా ప్రతిష్ట దిగజారిందనే భావనతో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం షియాన్‌వాంగ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయిందని పరిశీలకులు భావిస్తున్నారు.   

VIDEOS

logo