మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 09, 2020 , 16:11:16

చేప మృతి.. దేశాధ్య‌క్షుడి సంతాపం!

చేప మృతి.. దేశాధ్య‌క్షుడి సంతాపం!

న్యూఢిల్లీ: సాధార‌ణంగా ఎవ‌రైనా ప్రముఖులు మరణించిన‌ప్పుడు లేదంటే ఏదైనా ఘోర ప్రమాదంలో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయిన‌ప్పుడు దేశాధ్య‌క్షులు సంతాపం తెలుపుతారు. అయితే, జాంబియా అధ్యక్షుడు ఎడ్గార్ లుంగూ మాత్రం ఓ చేప మరణిస్తే సంతాపం తెలియ‌జేశారు. చేప చ‌నిపోతే అధ్య‌క్షుడు సంతాపం తెలుప‌డం ఏమిటి అనుకుంటున్నారా..? ఎందుకంటే ఆ చేప‌కు కొన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. జాంబియాలోని కాప‌ర్‌బెల్ట్ యూనివ‌ర్సిటీలో ఆ చేప ఉండేది.  

మాఫిషి అనే ఆ చేప ఒక సెంటిమెంట‌ల్ చేప‌. విద్యార్థులు పరీక్షలకు హజరయ్యేముందు ఆ చేపను చూసి వెళ్లేవారు. దానివ‌ల్ల వారికి అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని న‌మ్మ‌కం. మ‌రికొంద‌రు ఆ చేప‌ను కొద్దిసేపు త‌దేకంగా చూడటం ద్వారా మానసిక ఒత్తిడి త‌గ్గుతుంద‌ని భావించేవారు. అందుకే ఆ చేపకు గుడ్ ల‌క్ ఫిష్ అని పేరు ప‌డింది. యూనివ‌ర్సిటీ చెరువులో గ‌త 20 ఏండ్లుగా ఆ చేప ఉంటున్న‌ది. 

ఇప్పుడు ఆ చేప చ‌నిపోవ‌డంతో విద్యార్థులు బాధ‌ప‌డుతున్నారు. దానికి మృతి సంతాపంగా క్యాంప‌స్ చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అందుకే ఆ చేప ప్ర‌త్యేక‌త‌ను తెలుసుకున్న జాంబియా అధ్య‌క్షుడు కూడా దానికి సంతాపం తెలిపారు. కాగా చేప మృత‌దేహాన్ని ఇంకా ఖ‌న‌నం చేయ‌లేదు. ఆ చేప‌కు కుళ్లిపోకుండా కెమిక‌ల్స్ పూసి ల్యాబ్‌లో భ‌ద్ర‌ప‌ర్చాల‌ని యూనివ‌ర్సిటీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo